MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-condition-to-uppena-movie-directora168e528-6d72-4dc2-868f-b4280f03221e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-condition-to-uppena-movie-directora168e528-6d72-4dc2-868f-b4280f03221e-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సంపాదించింది. ఇప్పుడు హౌస్ ఫుల్ కలెక్షన్లతో సునామీ కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ వెనుక దర్శకుడు బుచ్చిబాబు కృషి చాలా ఉంది. ఆయన పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. కథ మొదలుకుని హీరో, హీరోయిన్ల సెలక్షన్స్.. నటన.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాడు.vijay devarakonda;chiranjeevi;kumaar;sukumar;vijay;cinema;arjun reddy;tsunami;hero;success;joseph vijay;house;vaishnav tej;arjun 1;reddyవిజయ్ దేవరకొండను కాదని వైష్ణవ్ తో ఉప్పెన తీస్తే ఈ హీరో పెట్టిన కండిషన్ ఏంటి..?విజయ్ దేవరకొండను కాదని వైష్ణవ్ తో ఉప్పెన తీస్తే ఈ హీరో పెట్టిన కండిషన్ ఏంటి..?vijay devarakonda;chiranjeevi;kumaar;sukumar;vijay;cinema;arjun reddy;tsunami;hero;success;joseph vijay;house;vaishnav tej;arjun 1;reddyWed, 17 Feb 2021 13:00:00 GMTసినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సంపాదించింది. ఇప్పుడు హౌస్ ఫుల్ కలెక్షన్లతో  సునామీ కురిపిస్తోంది.  ఈ సినిమా సక్సెస్ వెనుక దర్శకుడు బుచ్చిబాబు కృషి చాలా ఉంది. ఆయన పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. కథ మొదలుకుని హీరో, హీరోయిన్ల సెలక్షన్స్.. నటన.. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యి.. హిట్ టాక్ వచ్చే వరకు బుచ్చిబాబు ప్రశాంతంగా నిద్రపోలేదు.

సినిమా కథ రాసుకున్న బుచ్చిబాబు.. మొదట హీరో కోసం వెతికాడు. ఈ సినిమాలో కథే హీరో.. కథని నమ్మి ప్రాణం పెట్టి నటించే హీరో కావాలని అనుకున్నాడు. అందుకే విజయ్ దేవరకొండని మొదట హీరోగా సెలక్ట్ చేశాడు. అయితే అప్పటికే ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఈ కథ  కొత్త వ్యక్తితో చేస్తే బాగుంటుందని బుచ్చిబాబుకి అనిపించింది.


ఒకసారి ఇన్ స్టా గ్రామ్ లో వైష్ణవ్ తేజ్ ఫోటోను చూశాడు. ఆయనకు నచ్చడంతో  హీరోగా తీసుకుంటే ఎలా ఉంటుందని గురువు సుకుమార్ ను అడిగాడు. కథలో కంటెంట్ ఉంది కాబట్టి మెగా ఫ్యామిలీ అంగీకరిస్తారనే అభిప్రాయానికి వచ్చారు. అయితే వైష్ణవ్ తేజ్  కథకు సరిపోతాడా లేదా అనే విషయాన్ని ముందు గమనించమని బుచ్చిబాబుకు సలహా ఇచ్చాడు

రంగ స్థలం షూటింగ్ సమయంలో స్పాట్ కి వచ్చిన వైష్ణవ్ తేజ్ ని జాగ్రత్తగా గమనించాడట దర్శకుడు బుచ్చిబాబు.. అలా కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేశాక.. వైష్ణవ్ తేజ్ తాను రాసుకున్న కథలో హీరోకి సరిపోతాడనే నిర్ణయానికి వచ్చాడు. తర్వాత వైష్ణవ్ తేజ్ కి కథ చెప్పాడట. మొత్తానికి వైష్ణవ్ తేజ్ కి కథ నచ్చింది కానీ..సినిమాకి చిరంజీవి ఓకే చెప్పాలనే కండిషన్ పెట్టాడు.

ఇక చిరంజీవికి కథ వినిపించడానికి బుచ్చిబాబు చాలా ప్రిపేర్ అయ్యాడు. వారం రోజుల పాటు కష్టపడి చిరంజీవికి కథ వినిపించాడు. చివరకు ఆయనకు కూడా కథ నచ్చడంతో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లిందని ఆనాటి ఆసక్తికర సన్నివేశాలను బుచ్చిబాబు ఓ ఇంటర్య్వూలో పంచుకున్నాడు.


నాగార్జున బ్యానర్ లో సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్....

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>