PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan131e8074-a810-411f-bdd3-490af7672da2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan131e8074-a810-411f-bdd3-490af7672da2-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈనెల 23వ తేదీన భేటీకానుంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో అత్య‌వ‌రంగా ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించిన అంశంతోపాటు పంచాయితీ ఎన్నిక‌ల్లో కొన్నిచోట్ల వైసీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓట‌మి పాల‌వ‌డంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష జ‌ర‌గ‌నుంది. అలాగే పుర‌పాల‌క‌, న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంతోపాటు త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. jagan;view;andhra pradesh;vishakapatnam;central government;ycp;mantra23న అత్య‌వ‌స‌ర భేటీ??23న అత్య‌వ‌స‌ర భేటీ??jagan;view;andhra pradesh;vishakapatnam;central government;ycp;mantraWed, 17 Feb 2021 09:20:48 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈనెల 23వ తేదీన భేటీకానుంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో అత్య‌వ‌రంగా ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించిన అంశంతోపాటు పంచాయితీ ఎన్నిక‌ల్లో కొన్నిచోట్ల వైసీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు ఓట‌మి పాల‌వ‌డంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష జ‌ర‌గ‌నుంది. అలాగే పుర‌పాల‌క‌, న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంతోపాటు త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు.


విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించి ఏ నిర్ణ‌యం తీసుకోవాలి.. ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌లను తిప్పికొట్ట‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహంపై ముఖ్య‌మంత్రి మంత్రుల‌తో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కును 100 శాతం ప్ర‌యివేటీక‌రిస్తామంటూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం విధాన‌ప‌ర‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ దీనిపై ఏం చేయాల‌నే అంశంపై ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ప్ర‌యివేటీక‌ర‌ణ అంశం నుంచి విశాఖ ఉక్కుక‌ర్మాగారం ప్ర‌తిపాద‌న‌ను తొల‌గింప‌చేయాలంటే ఏం చేయాల‌నే అంశ‌మే ఈ భేటీలో ప్ర‌ధానాంశం కాబోతోంది. కేంద్రం ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ముందుకు సాగితే పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఉంది.

కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండాలి.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా చూసుకోవాలి.. ప్ర‌తిప‌క్షాల నుంచి రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోవాలి.. అనే మూడు అంశాల‌పైనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగానే అసెంబ్లీని కూడా స‌మావేశ‌ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను తాము వ్య‌తిరేకిస్తున్నామంటూ ఏక‌వాక్య తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం క‌నుక ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌రణ‌పై ముందుకే వెళితే సొంతంగా ఏపీ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసేలా బిడ్డింగ్‌లో కూడా పాల్గొనేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను కూడా స‌మాయ‌త్తం చేసే అవ‌కాశం ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లోను విశాఖ ఉక్కును ప్ర‌యివేటు ప‌రం కాకుండా అడ్డుకొని తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌నే కృత‌నిశ్చ‌యంతో ముఖ్య‌మంత్రి ఉన్న‌ట్లు తెలుస్తోంది.




కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>