PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతున్నది. వాస్తవానికి 2019లోనే ముఖ్యమంత్రి జగన్ దీనికి సహకరించారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరగడం రాష్ట్ర ప్రభుత్వం సైలెంటుగా ఉండటంతో ప్రజలలో ఆys jagan;bhavana;delhi;jagan;andhra pradesh;industries;vishakapatnam;prime minister;chief minister;parliment;central government;mantra;narendraఢిల్లీ వెళ్తున్న జగన్.. ఎంపీలతో కలిసేఢిల్లీ వెళ్తున్న జగన్.. ఎంపీలతో కలిసేys jagan;bhavana;delhi;jagan;andhra pradesh;industries;vishakapatnam;prime minister;chief minister;parliment;central government;mantra;narendraWed, 17 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతున్నది. వాస్తవానికి 2019లోనే ముఖ్యమంత్రి జగన్ దీనికి సహకరించారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరగడం రాష్ట్ర ప్రభుత్వం సైలెంటుగా ఉండటంతో ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతుందని అంటున్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మితే కేంద్ర ప్రభుత్వం కంటే ముఖ్యంగా ఇబ్బంది పడేది ముఖ్యమంత్రి వైయస్ జగన్. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరే ముఖ్యమంత్రి జగన్ గట్టిగా పోరాటం చేయలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అమ్మాలి అని పట్టుదలగా వ్యవహరిస్తుంది అనే భావన కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశముంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం అమ్మాలి అని భావిస్తే దానిని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన పరిస్థితి ఉంది.

కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఒక విమర్శ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చేయలేకపోతున్నారని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులను కూడా ముఖ్యమంత్రి జగన్ సైలెంట్ గా ఉంచారు. పార్లమెంట్ లో ఎంపీలు కూడా పెద్దగా మాట్లాడనిచ్చే ప్రయత్నం చేయలేదు. దీనివలన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లొంగి ఉంది అనే భావన స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన నేరుగా సమావేశమై ఈ విషయానికి సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా ముందుకు వెళ్తారు చూడాలి.


షవర్ కింద స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>