Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thieves949d295c-b4f6-4cf6-b531-7a361b5fe61a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thieves949d295c-b4f6-4cf6-b531-7a361b5fe61a-415x250-IndiaHerald.jpgరవితేజ నటించిన దొంగోడు సినిమా చూశారా..? అందులో రవితేజ ఏ ఇంటినైనా చూసి మీసం మెలేశాడంటే ఆ ఇంట్లో ఆ రాత్రి దొంగతనం చేసేస్తాడు. ఎంత పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినా అతడిని పట్టుకోవడం కష్టం. అయితే అలాంటి ఓ దొంగల ముఠానే పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలకు పాల్పతున్న ఈ ఆరుగురి ఘరానా ముఠాను..thieves;auto;ravi;rani;ravi teja;renu desai;swetha;thulasi;tiru;hyderabad;cinema;police;king;tulasi;silverఅనగనగా ఆరుగురు.. స్కెచ్ వేశారో ఖల్లాస్..!అనగనగా ఆరుగురు.. స్కెచ్ వేశారో ఖల్లాస్..!thieves;auto;ravi;rani;ravi teja;renu desai;swetha;thulasi;tiru;hyderabad;cinema;police;king;tulasi;silverWed, 17 Feb 2021 19:17:00 GMTహైదరాబాద్: రవితేజ నటించిన దొంగోడు సినిమా చూశారా..? అందులో రవితేజ ఏ ఇంటినైనా చూసి మీసం మెలేశాడంటే ఆ ఇంట్లో ఆ రాత్రి దొంగతనం చేసేస్తాడు. ఎంత పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినా అతడిని పట్టుకోవడం కష్టం. అయితే అలాంటి ఓ దొంగల ముఠానే పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలకు పాల్పతున్న ఈ ఆరుగురి ఘరానా ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆరుగురూ ఓ గ్యాంగుగా ఏర్పడి కస్టమర్లుగా మారి జువెల్లరీ షాపులకు వెళ్తారు. షాపు యజమాని దృష్టి మరల్చి అక్కడి నుంచి వెండి వస్తువులను తస్కరించి పారిపోతుంటారు.

ఈ ముఠాకు లీడర్‌గా వ్యవహరిస్తున్న హయత్‌నగర్‌కు చెందిన వై రేణుక(40) ఇప్పటి వరకు 13 కేసుల్లో నిందితురాలిగా ఉంది. మున్నెల్లి కిరణ్‌(40) ఆటోడ్రైవర్‌, ఇతను ఇప్పటి వరకు 3కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వై.తులసి(24)పై 8కేసులున్నాయి. వై.శ్వేత(22)పై 3 కేసులు ఉన్నాయి. వై.రాజు(29)పై 2 కేసులున్నాయి. ఓ కేసులో సనత్‌ నగర్‌ పీఎస్‌లో వాంటెడ్‌గా కూడా రాజు ఉన్నాడు. ఎల్‌బీనగర్‌ ప్రాంత నివాసి ఎలిజబెత్‌ రాణి(25)పై 2 కేసులు ఉన్నాయి. మేడిపల్లి పీఎస్‌లో ఆమె వాంటెడ్‌గా ఉంది.

ఈ ముఠా తాజా అరెస్టుతో తుకారాంగేట్‌ పీఎస్‌లో-1, చిలకలగూడ పీఎస్‌లో-1, రాచకొండ కమిషనరేట్‌ నాచారం పీఎస్‌లో-1 మొత్తం 3 కేసుల చిక్కుముళ్లు వీడాయి. వారి నుంచి రూ.2.5లక్షలు విలువ చేసే 1070 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ఓ ఆటో, 4మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన నిందితులు 15ఏళ్ల క్రితం నగరానికి వలసొచ్చారు. ఆటోలో తిరుగుతూ ఆభరణాల షాపు యజమానుల దృష్టి మళ్లించి అందినకాడికి దోచుకుంటారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు సోమవారం వారి గురించి సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం మున్నెళ్లి కిరణ్‌, వై.రేణుక, వై తులసి, వై. స్వామిని తుకారాంగేట్‌ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు వై.రాజును సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. మరో నిందితురాలు ఎలిజబెత్‌ను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఇకనైనా ఇలాంటి ఘరాగా దొంగలతో జాగ్రత్తగా ఉండండి.


చైనాను అమెరికా వదిలేలా లేదు.. ఆ విషయంలో తాజా వార్నింగ్

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>