Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/srinagar-temple1cf901df-3d18-435c-a96f-dd7ea0d796a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/srinagar-temple1cf901df-3d18-435c-a96f-dd7ea0d796a7-415x250-IndiaHerald.jpg హిమాలయాలంటేనే హిందువులు దేవభూమిగా భావిస్తారు. ఆ ప్రాంతంలో దేవుళ్లు తిరుగాడుతుంటారని భావిస్తుంటారు. అలాంటి దేవ భూమిలో ఓ ఆలయం మూడు దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. అయితే ఎట్టకేలకు ఆ ఆలయం తెరుచుకుంది. ఉగ్రవాదుల కారణంగా ఎప్పుడు 1980ల్లో మూతపడిన ఆ ఆలయం ఇప్పుడు మళ్లీ..srinagar temple;jayanthi;pooja hegde;sheetal;deva;santhosh;tiru;srinagar;baba bhaskar;sheetal khandal;aqua;local language;hindus;santhossh jagarlapudi;jayamమూడు దశాబ్దాల నాటి హిమాలయ ఆలయం.. ఎట్టకేలకు తెరుచుకుంది..మూడు దశాబ్దాల నాటి హిమాలయ ఆలయం.. ఎట్టకేలకు తెరుచుకుంది..srinagar temple;jayanthi;pooja hegde;sheetal;deva;santhosh;tiru;srinagar;baba bhaskar;sheetal khandal;aqua;local language;hindus;santhossh jagarlapudi;jayamWed, 17 Feb 2021 18:48:00 GMTశ్రీనగర్: హిమాలయాలంటేనే హిందువులు దేవభూమిగా భావిస్తారు. ఆ ప్రాంతంలో దేవుళ్లు తిరుగాడుతుంటారని భావిస్తుంటారు. అలాంటి దేవ భూమిలో ఓ ఆలయం మూడు దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. అయితే ఎట్టకేలకు ఆ ఆలయం తెరుచుకుంది. ఉగ్రవాదుల కారణంగా ఎప్పుడు 1980ల్లో మూతపడిన ఆ ఆలయం ఇప్పుడు మళ్లీ పూజలందుకుంటోంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని తెరుచేందుకు స్థానిక ముస్లింలు కూడా హిందువులకు సహకరించారు.

అది శ్రీనగర్‌లోని శీతల్‌నాథ్ దేవాలయం.. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల తాకిడి తట్టుకోలేక ఆలయాన్ని అక్కడివారు మూసేశారు. ఆ తరువాత మళ్లీ ఆ ఆలయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆలనా పాలనా లేక ఆలయం దెబ్బతిన్నది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఆలయాన్ని బసంత్ పంచమి సందర్భంగా అధికారుల సాయంతో స్థానికులు తెరిచాడు. శ్రీనగర్‌లోని హబ్బా కదల్ ప్రాంతలో ఉన్న శీతల్ నాథ్ దేవాలయాన్ని సుదీర్ఘకాలం తర్వాత తెరచి బసంత్ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

స్థానికంగా ఉన్న ముస్లిముల సహకారంతోనే తాము దేవాలయాన్ని 31 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించామని భక్తుడు సంతోష్ రజ్దాన్ చెప్పారు. ఉగ్రవాద ప్రాబల్యం వల్ల 31 ఏళ్ల క్రితం శీతల్ నాథ్ దేవాలయాన్ని మూసివేశారు. దేవాలయం సమీపంలో ఉండే హిందువులు సైతం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు.
                 
స్థానిక ముస్లిములే ముందుకు వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేసి భక్తుల ప్రవేశానికి సిద్ధం చేశారని ఆలయ నిర్వాహకులు రవీందర్ రజ్దాన్ చెప్పారు. ‘మన ముస్లిమ్ సోదరులు పూజా సామాగ్రి ఇచ్చారని, దాంతోనే తాము పూజలు చేశాం, బాబా శీతల్ నాథ్ భైరవ్ జయంతి ఉత్సవాలు బసంత్ పంచమి సందర్భంగా నిర్వహించాం’ అని రజ్దాన్ వివరించారు.




ప్రభాస్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన మహానటి దర్శకుడు..??

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>