PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-bandi-sanjay63c8331e-e1f7-466b-b707-75fbe8cf1335-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-bandi-sanjay63c8331e-e1f7-466b-b707-75fbe8cf1335-415x250-IndiaHerald.jpgతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ప్రైవేటు టీచర్ల వెతలపై స్పందించారు. ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు లెక్చరర్లు, టీచర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని బండి సంజయ్ మరోసారి డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి వాళ్ళ ఉసురు పోసుకోవద్దని బండి సంజయ్ అన్నారు. ఈ సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయమన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల గురించి ప్రభుత్వం పట్టిkcr-bandi sanjay;kcr;jr ntr;naga chaitanya;bharatiya janata party;telangana;school;college;chaitanya 1;corporateటీచర్ల వెతలు: కేసీఆర్.. వాళ్ల ఉసురుపోసుకోండి.. ఆదుకోండి..?టీచర్ల వెతలు: కేసీఆర్.. వాళ్ల ఉసురుపోసుకోండి.. ఆదుకోండి..?kcr-bandi sanjay;kcr;jr ntr;naga chaitanya;bharatiya janata party;telangana;school;college;chaitanya 1;corporateWed, 17 Feb 2021 08:48:51 GMTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ప్రైవేటు టీచర్ల వెతలపై స్పందించారు.
ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు లెక్చరర్లు, టీచర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని బండి సంజయ్ మరోసారి డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి వాళ్ళ ఉసురు పోసుకోవద్దని బండి సంజయ్ అన్నారు. ఈ సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయమన్నారు.


ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేస్తూ, అధ్యపకులను మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారా అంటూ పాఠశాల యాజమాన్యాలను బండి సంజయ్ నిలదీశారు. టీచర్లు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వక పోతే ఆయా సంస్థల సిబ్బందే కార్పొరేట్ కాలేజీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతవరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన ఇప్పటికే  వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.


ఇటీవల చైతన్యపురిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ లెక్చరర్ డా.హరినాథ్ జీతాలు లేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపైనా బండి సంజయ్ స్పందించారు. విద్యా రంగంలో దాదాపు సగ భాగంగా ఉన్న ప్రైవేటు విద్యా రంగంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల పని పరిస్థితులు, వేతనాలు, సర్వీస్‌ నిబంధనలు మెరుగు పడవలసిన అవసరముందన్నారు బండి సంజయ్. ప్రత్యేకించి ప్రస్తుతం కరోనా సంక్షోభ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్యం ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను, అధ్యాపకులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలని కోరారు బండి సంజయ్.


కరోనా కారణంగా లక్షల మంది ప్రైవేటు టీచర్లు జీతాలు లేక అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు ఈ కరోనా కాలంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని కుటుంబాలు గడవని పరిస్థితి. కానీ ఈ సమస్యపై గళమెత్తే నాయకులే కరవయ్యారు. బండి సంజయ్‌ తరహాలో మరికొందరు గట్టిగా స్పందిస్తే ప్రభుత్వాలు కదిలే అవకాశం ఉంది. 


ఎంత ట్రై చేసిన .. అది మాత్రం వర్కౌట్ అవ్వట్లేదే..!!

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>