MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/seltmoblscxzwqsfgjkl12345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/seltmoblscxzwqsfgjkl12345-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ జబర్దస్త్ రైసింగ్ రాజు ని సన్మానించారు. జూనియర్ ఎన్టీఆర్ కి, రైసింగ్ రాజు కి సంబంధం ఏమిటి. ఎన్టీఆర్ జబర్దస్త్ షో కి వచ్చారని అనుకుంటున్నారా అసలు ఏమి జరిగి ఉంటుంది. అక్కడికే వస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సైబరాబాద్ లో జరిగిన ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారుjr ntr;ntr;jr ntr;santoshi;jabardasth;kanna lakshminarayana;youtube;you tube;king;traffic police;nandamuri taraka rama raoజబర్దస్త్ కమెడియన్‌తో ఎన్టీఆర్ ప్రవర్తన చూడండి..తారక్ ప్రవర్తన చూసి అందరు షాక్జబర్దస్త్ కమెడియన్‌తో ఎన్టీఆర్ ప్రవర్తన చూడండి..తారక్ ప్రవర్తన చూసి అందరు షాక్jr ntr;ntr;jr ntr;santoshi;jabardasth;kanna lakshminarayana;youtube;you tube;king;traffic police;nandamuri taraka rama raoWed, 17 Feb 2021 20:12:02 GMTజూనియర్ ఎన్టీఆర్  జబర్దస్త్ రైసింగ్ రాజు ని సన్మానించారు. జూనియర్ ఎన్టీఆర్ కి, రైసింగ్ రాజు కి సంబంధం ఏమిటి. ఎన్టీఆర్ జబర్దస్త్ షో కి  వచ్చారని అనుకుంటున్నారా అసలు ఏమి జరిగి ఉంటుంది.  అక్కడికే వస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సైబరాబాద్ లో జరిగిన ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.అక్కడ ట్రాఫిక్ నిబంధనల గురించి మరియు రోడ్డు ప్రమాదాలను జరగకుండా మనం ఏవిధమైన చర్యలు తీసుకోవాలని అనే విషయాలపై మాట్లాడారు. ఈ వేడుకలో చాల మంది ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ గారి వినయం మరియు విధేయత గురించి మనకి తెలిసిందే. తాను వ్యక్తులకు ఇచ్చే మర్యాదల గురించి తన కన్నా పెద్దవారికి ఇచ్చే గౌరవం గురించి మనం కళ్ళారా చూసాము.

సరిగ్గా అలాంటిదే ఈరోజు సైబరాబాద్ వేడుకలో జరిగింది.అయితే ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ కార్యక్రమానికి రైసింగ్ రాజు కూడా విచ్చేసారు.అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా కొందరికి సన్మానం కూడా జరిగింది. అయన చేతుల మీదుగా రైసింగ్ రాజు కూడా సన్మానం అందుకున్నారు. ఈ క్రమంలో సన్మానం కోసం స్టేజి పైకి వచ్చిన రాజు ఎన్టీఆర్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అందుకోబోతుండగా ఎన్టీఆర్ అతడిని ఆపి పైకి లేపి మీరు నాకంటే పెద్దవారు నా కాళ్ళ మీద పడడం శ్రేయస్కరం కాదని రాజుతో అనడంతో తన ముఖం లో ఆనందం వెల్లివిరిసింది . దాంతో ఎన్టీఆర్ అతన్ని సన్మానిస్తూ నమస్కరం పెట్టి, సరదాగా రాజుని  పలకరించారు. ఎన్టీఆర్ ఇలా చేయడంతో అయన ప్రవర్తన చూసి అక్కడున్న వారు  సంతోషించారు. పెద్దవారి పట్ల ఉన్న మర్యాద భావాన్ని ఎన్టీఆర్ మరోసారి నిరూపించారు.ఆలా జూనియర్ ఎన్టీఆర్ జబర్దస్త్ రైసింగ్ రాజు ని సన్మానించడం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ అద్భుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అయితే ప్రసంగం మధ్యలో రోడ్డు ప్రమాదం లో మరణించిన వ్యక్తులను ఒకసారి గుర్తు చేసుకోవడం విశేషం. ఇక  ఎన్టీఆర్ సైబరాబాద్ వేడుకలో పాల్గొన్న వీడియో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది.


ప్రభాస్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన మహానటి దర్శకుడు..??

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>