MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh076dde3f-26fc-47c6-af24-6402a1d9c2a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh076dde3f-26fc-47c6-af24-6402a1d9c2a3-415x250-IndiaHerald.jpgసినిమా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ విపరీతమైన ఆశక్తి ఉంటుంది. దీనితో అనునిత్యం వారి పై వచ్చే గాసిప్పులతో మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో తమిళ మీడియా ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ అనిరుధ్ ల మధ్య ఎదో జరుగుతోంది అంటూ తమిళ మీడియా గాసిప్పుల హంగామా మొదలు పెట్టింది. కీర్తి సురేష్ హీరోయిన్ అయినప్పటికీ బయట ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు చాల పద్ధతిలో ఉంటుంది. గ్లామర్ ఎక్స్ పోజింగ్ విషయంలో కూడ ఆమె కొన్ని హద్దులు పెట్టుకుంది. పార్టీలకు పబ్స్ కు ఆమkeerthy suresh;suresh;keerthi suresh;kirti;nithya new;cinema;media;tamil;heroineకీర్తి సురేష్ అనిరుధ్ లపై గాసిప్పులతో హోరెత్తిపోతున్న తమిళ మీడియా !కీర్తి సురేష్ అనిరుధ్ లపై గాసిప్పులతో హోరెత్తిపోతున్న తమిళ మీడియా !keerthy suresh;suresh;keerthi suresh;kirti;nithya new;cinema;media;tamil;heroineWed, 17 Feb 2021 09:00:00 GMTసినిమా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ విపరీతమైన ఆశక్తి ఉంటుంది. దీనితో అనునిత్యం వారి పై వచ్చే గాసిప్పులతో మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో తమిళ మీడియా ఒక అడుగు ముందే ఉంటుంది.  


ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ అనిరుధ్ ల మధ్య ఎదో జరుగుతోంది అంటూ తమిళ మీడియా గాసిప్పుల హంగామా మొదలు పెట్టింది. కీర్తి సురేష్ హీరోయిన్ అయినప్పటికీ బయట ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు చాల పద్ధతిలో ఉంటుంది. గ్లామర్ ఎక్స్ పోజింగ్ విషయంలో కూడ ఆమె కొన్ని హద్దులు పెట్టుకుంది. పార్టీలకు పబ్స్ కు ఆమె వెళ్ళదు.


అలాంటి కీర్తిని ఇప్పుడు అనిరుధ్ పూర్తిగా మార్చేశాడ అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికి కారణం వీరిద్దరూ చాల సన్నిహితంగా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు తమిళ మీడియాకు లీక్ అయింది. దీనితో ఇప్పుడు ఆ ఫోటో పై రకరకాల గాసిప్పులు అల్లుతున్నారు. అనిరుధ్ అమ్మాయిలతో సరదాగా ఉండటం సర్వసాధారణం. గతంలో అతడి పై అనేక గాసిప్పులు కూడ వచ్చాయి. అయితే కీర్తి హీరోలతో కూడ అంత చనువుగా ఉండదు.


అలాంటిది ఆమె ఇంత చనువుగా అనిరుధ్ తో దగ్గరగా ఉన్న సందర్భం ఎక్కడ ఎప్పుడు జరిగింది అంటూ తమిళ మీడియా ఆరాలు తీస్తోంది. ఈ ఫోటో మీడియాలో ఇంత అలజడి సృష్టిస్తున్నా ఈ విషయమై కీర్తి కాని అనిరుధ్ కానీ ఖండించక పోవడం మరింత ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుతం ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా కీర్తి ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ లో అనిరుధ్ తన పాటల బిజీలో ఉన్నారని సరిపెట్టుకున్నా వివాదాలకు గాసిప్పులకు దూరంగా ఉండే కీర్తి వ్యక్తిత్వం పై ఈ ఫోటో అనవసరమైన బురద జల్లుతోంది అంటూ ఆమె అభిమానులు మండిపడుతూ ఈ విషయమై ఆమె నుంచి ఒక క్లారిటీ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు..




జగడ్డ : విశాఖ ఏజెన్సీలో మధ్యాహ్నంతో సరి

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>