PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడంతో ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపించిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వారిని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇప్పుడు జనసేన అభ్యర్ధులను ఇబ్బంది పెట్టడంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఉన్నారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన మpawan kalyan;pawan;kalyan;andhra pradesh;janasena;panchayati;local language;janasena party;nijam;partyవాలంటీర్ లకు అండగా పవన్వాలంటీర్ లకు అండగా పవన్pawan kalyan;pawan;kalyan;andhra pradesh;janasena;panchayati;local language;janasena party;nijam;partyWed, 17 Feb 2021 09:35:53 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడంతో ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపించిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వారిని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇప్పుడు జనసేన అభ్యర్ధులను  ఇబ్బంది పెట్టడంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఉన్నారు అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు.  గ్రామాల్లో జనసేన బలంగా ఉందనేందుకు పంచాయతీ ఫలితాలే చెబుతున్నాయి అని ఆయన అన్నారు. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైంది అని ఆయన తెలిపారు.  అధికార పార్టీ ఒత్తిళ్లు... బెదిరింపులు తట్టుకొని నిలిచారు  అని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండీ అధికార పార్టీవాళ్ళు భయపడుతున్నారు  అని ఆయన ఆరోపించారు. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపించాలి   అని ఆయన కోరారు.

మొదటి విడతలో 18 శాతానికి పైగా ఓట్లు వస్తే... రెండో విడతలో అది 22 శాతం దాటింది అని అన్నారు.  అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణం అని పవన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు చెప్పారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వాళ్లతో రకరకాల బెదిరింపులకు దిగుతున్నారు అని మండిపడ్డారు. కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా కిడ్నాప్ చేయిస్తున్నారు అని అన్నారు. జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.


పెళ్లి సమయంలో ఆ హీరోయిన్ అంటే క్రష్ అంటున్న మెగా హీరో..?

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>