Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kim101908ee-7651-437e-9e57-5598787043b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kim101908ee-7651-437e-9e57-5598787043b2-415x250-IndiaHerald.jpgఉత్తరకొరియా అధ్యక్షుడు, సుప్రీం కిమ్ జాంగ్ ఉన్ భార్య దాదాపు ఏడాదిన్నరగా కనపడలేదు. ఆమె ఎక్కడున్నారో..? ఏం చేస్తున్నారో..? కూడా ఎవరికీ తెలియదు. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయంపై అనేక పుకార్లు చెలరేగాయి. కిమ్ స్వయంగా తన భార్యను చంపేసి ఉంటాడని, అందుకే ఆమె కనపడడం లేదని విచిత్రమైన ..kim;jayanthi;korea, south;government;media;husband;wife;father;party;jayamకిమ్ భార్య కనపడిందోచ్.. ఇన్నాళ్లు ఎక్కడికెళ్లిందంటే..కిమ్ భార్య కనపడిందోచ్.. ఇన్నాళ్లు ఎక్కడికెళ్లిందంటే..kim;jayanthi;korea, south;government;media;husband;wife;father;party;jayamWed, 17 Feb 2021 19:52:49 GMTప్యాంగాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు, సుప్రీం కిమ్ జాంగ్ ఉన్ భార్య దాదాపు ఏడాదిన్నరగా కనపడలేదు. ఆమె ఎక్కడున్నారో..? ఏం చేస్తున్నారో..? కూడా ఎవరికీ తెలియదు. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయంపై అనేక పుకార్లు చెలరేగాయి. కిమ్ స్వయంగా తన భార్యను చంపేసి ఉంటారని, అందుకే ఆమె కనపడడం లేదని విచిత్రమైన వార్తలెన్నో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలన్నింటికీ తెర దించుతూ ఆమె ప్రత్యక్షమయ్యారు.

కిమ్ తండ్రి కిమ్ జాంగ్ 2 జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో కిమ్ భార్య రీ సోల్ జూ పాల్గొన్నారు. భర్త కిమ్‌తో పాటు ఆమె నవ్వుతూ ఉన్న ఫోటోను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తాజాగా ప్రచురించింది. ‘భార్యతో సహా ఆడిటోరియంలోకి అడుగు పెట్టిన పార్టీ జనరల్ సెక్రెటరీకి(కిమ్) అక్కడున్న వారందరూ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు’ అని సదరు వార్త సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉంటే కరోనా సంక్షోభం కారణంగా ఉత్తరకొరియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లపోవడంతో రీ సోల్ జూ కూడా ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆమె ఆచూకీ విషయంలో ఏకంగా ఏడాది పాటు సస్పెన్స్ కొనసాగింది. ఎప్పటి లాగే కిమ్ ప్రభుత్వం ఈ విషయంలో గోప్యత పాటించింది. ఇక అక్కడి ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం.. కొన్ని అధికారిక పార్టీ కార్యక్రమాల సమయంలో కిమ్‌తో ఆయన భార్య కూడా హాజరుకావాలి. కానీ.. అలాంటి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. కిమ్ ఒక్కరే పాల్గొన్నారు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.


ఇక ఏడాదిన్నరగా రి సోల్ జూ పూర్తిగా ప్రజాజీవితం నుంచి కనుమరుగైపోవడం, ఉత్తర కొరియా పగ్గాలు కిమ్ సోదరి చేతుల్లోకి వెళుతున్నాయనే వార్తలు గుప్పుమనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఇలాంటి సందర్భంలోనే అనూహ్యంగా కిమ్ మరోసారి ప్రజలకు దర్శనమివ్వడంతో ఈ వదంతులకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన భార్య కూడా ప్రజల ముందుకు రావడంతో ఉత్తరకొరియా ప్రభుత్వంలో ధైర్యం పెరిగిందని, కరోనా సంక్షోభాన్ని నియంత్రించగలిగామన్న నమ్మకం కనిపిస్తోందని కొందరంటున్నారు.


నలుగేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వివరణ ఇస్తున్న హాట్ హీరోయిన్..మరి ఇంతకాలం ఎందుకు స్పందించలేదో.?

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>