MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/postal-stamps634e353a-c5ec-41f1-9fa3-773567090c7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/postal-stamps634e353a-c5ec-41f1-9fa3-773567090c7b-415x250-IndiaHerald.jpgసాధారణంగా పోస్టల్ స్టాంపులను భారత ప్రభుత్వం, ఎంతో ఘనత సాధించిన వారు, వివిధ రంగాలలో విశిష్ట సేవ చేసిన వారి పేరు మీద, వారి జ్ఞాపకార్థం గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వారిలో మరీ ముఖ్యంగా మన తెలుగు జాతి సంతతకు చెందిన నటులు ఉండడం గమనార్హం..అందులో మన తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన 10 మంది నటుల సేవలను గుర్తించి, వారి మరణాంతరం, వారి జ్ఞాపకార్ధంగా ,వారి పేరు మీదుగా పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది భారత ప్రభుత్వం. అయితే ఆ నటులు ఎవరో చూద్దాం.. postal stamps;ntr;gopichand;dadasaheb phalke;allu ramalingaiah;bhanu;bhanumathi old;ghantasala;prasad;raghu;savitri;telugu;tamil;producer;kannada;film industry;industry;director;husband;comedian;producer1;service;indian postal service;central government;nandamuri taraka rama rao;venkaiah naidu;savithri 1;v;padma shriతెలుగులో ఈ గొప్ప నటుల పేరు మీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిందట...తెలుగులో ఈ గొప్ప నటుల పేరు మీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిందట...postal stamps;ntr;gopichand;dadasaheb phalke;allu ramalingaiah;bhanu;bhanumathi old;ghantasala;prasad;raghu;savitri;telugu;tamil;producer;kannada;film industry;industry;director;husband;comedian;producer1;service;indian postal service;central government;nandamuri taraka rama rao;venkaiah naidu;savithri 1;v;padma shriWed, 17 Feb 2021 12:00:00 GMTపోస్టల్ స్టాంపులను భారత ప్రభుత్వం, ఎంతో ఘనత సాధించిన వారు, వివిధ రంగాలలో విశిష్ట సేవ  చేసిన వారి పేరు మీద, వారి జ్ఞాపకార్థం గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వారిలో మరీ ముఖ్యంగా మన తెలుగు జాతి సంతతకు చెందిన నటులు ఉండడం గమనార్హం..అందులో మన తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన 10 మంది నటుల సేవలను గుర్తించి, వారి మరణాంతరం, వారి జ్ఞాపకార్ధంగా ,వారి పేరు మీదుగా పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది భారత ప్రభుత్వం. అయితే  ఆ నటులు ఎవరో చూద్దాం..


1. ఎన్టీఆర్ (2000):
నటసార్వభౌముడుగా పేరుగాంచిన ఎన్టీఆర్, ఇక భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా ఆయన పేరు మీదుగా పోస్టల్ స్టాంపును  విడుదల చేసింది. మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

2. ఘంటసాల  (2003):
తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో 1000కి పైగా సినిమాలకు సంగీతమందించడమే కాక.. ఎన్నో పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు గాంచాడు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2003 లో పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది.

3 సావిత్రి (2011):
1960 లో వచ్చిన చివరకు మిగిలేది అనే సినిమాలో తన నటనకు గానూ,సావిత్రి కి రాష్ట్రపతి అవార్డు సాధించింది. అందుకుగాను ఈమె పేరు మీద 2011 లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.

4. ఎస్.వి.రంగారావు (2013):
ఘటోత్కచుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, నటించినందుకు గాను ఎస్.వి  రంగారావు జ్ఞాపకార్థంగా 2013లో భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

5. త్రిపురనేని గోపీచంద్  (2011):
నవలా రచయితగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించిన గోపీచంద్,సినిమాలకు మాటలు,కథను అందించేవారు. ఇక కేంద్ర సాహిత్య అవార్డు పొందిన గోపీచంద్ జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం 2011లో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

6. అల్లు రామలింగయ్య  (2013):
1000 చిత్రాలకుపైగా కమెడియన్ గా నటించిన అల్లు రామలింగయ్య , పద్మశ్రీ,రఘుపతి వెంకయ్య అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇక అందుకుగాను 2013లో ఆయన జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

7. భానుమతి  (2013):
నటి, డైరెక్టర్,నిర్మాత,  కంపోజర్, సింగర్, లిరిసిస్ట్  ఇలా ఎన్నో రంగాలలో పేరుప్రఖ్యాతలు సంపాదించిన భానుమతి, పద్మభూషణ్ అవార్డును పొందింది. ఇక ఈమె జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం 2013 లో పోస్టల్ స్టాంప్ ను ఈమె పేరుమీద విడుదల చేసింది.

8. నగేష్  (2013):
1000 చిత్రాలకుపైగా నటించిన నగేష్ తెలుగు,తమిళ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆయన జ్ఞాపకార్థం 2013లో భారత ప్రభుత్వం ఆయన పేరుమీద పోస్టల్ స్టాంపును రిలీజ్ చేసింది.

9. ఏఎన్ఆర్  (2014):
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య  అవార్డు, పద్మవిభూషణ్ పురస్కారాలు పొందిన ఏఎన్ఆర్ జ్ఞాపకార్ధంగా 2014 లో భారత ప్రభుత్వం ఆయన పేరు మీదగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

10. ఎల్.వి.ప్రసాద్  (2006):
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డును సొంతం చేసుకున్న డైరెక్టర్ ఎల్. వీ.ప్రసాద్ జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వం 2006లో ఈయన పేరు మీద పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.





చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>