PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-pista-house-alone-whether-all-fines-punishments-are-exempted-to-kcr-ktr-trs-1d36c322-56aa-4bae-834e-4f20ba227aa4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/why-pista-house-alone-whether-all-fines-punishments-are-exempted-to-kcr-ktr-trs-1d36c322-56aa-4bae-834e-4f20ba227aa4-415x250-IndiaHerald.jpgట్విటర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మరి ఇదే జిహెచ్ఎంసి అధికారులు హైదరాబాదు నగరపాలక ఎన్నికలప్పుడు టాయిలెట్లను కూడా వదలకుండా హోర్దింగులు ఏర్పాటు చేసి అధికార టీఆరెస్ పార్టీకి సిగ్గులేకుండా ప్రచారం చేసారు. అదే టెలివిజన్లలో ప్రచారం అయిన ఇలాంటి వేల సందర్భాలను పరిగణనలలోకి తీసుకోరా! ది సో కాల్డ్ హైదరాబాదు మహా నగర పాలక ఎన్ఫోర్స్మెంట్ (బలవంతంగా చట్టాలను అమలు చేసే) అధికారులు. వాటిపై చర్యలు తీసుకొనే సామర్ధ్యం లేదా వారికి! పెద్దవాళ్ళghmc looks equal all;kcr;ktr;amala akkineni;raj;vidya;pistachio;charminar;house;mahaమేడం మేయర్! పిస్తాహౌస్‌కు దారుణ జరిమానా! మరి కేసీఆర్, కేటీఆర్, టీఆరెస్ లు అన్ని జరిమానాలకు, శిక్షలకు అతీతులా!మేడం మేయర్! పిస్తాహౌస్‌కు దారుణ జరిమానా! మరి కేసీఆర్, కేటీఆర్, టీఆరెస్ లు అన్ని జరిమానాలకు, శిక్షలకు అతీతులా!ghmc looks equal all;kcr;ktr;amala akkineni;raj;vidya;pistachio;charminar;house;mahaWed, 17 Feb 2021 11:00:00 GMT



పిస్తా హౌస్‌ హైదరాబాదు లో ప్రఖ్యాతి గాంచిన ఫుడ్-జంక్షన్. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు చార్మినార్ ప్రాంతంలోని ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్ ‌కు ₹50000/- జరిమానా విధించి దిమ్మ తిరిగి, బొమ్మ  కనిపించేలాగా షాకిచ్చింది.

 


చార్మినార్‌ లోని పిస్తా హౌస్‌ నిర్వాహకులు రెస్టారెంట్ ముందుకు మిల మిల మెరుస్తూ కళ్లు చెదిరేలా దేదీప్యమానంగా వెలిగే విద్యుద్దీపాల బోర్డును (హోర్దింగ్) ఏర్పాటు చేశారు. ఈ దీపాల వెలుగులు ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వారి కళ్లను బైర్లు కమ్మేలా చేస్తు జనానికి, అదీ వాహనాలు నడిపే వారికి, బాటసారులకు కూడా చాల అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయట అదే ప్రధాన కారణం. 

దీనిపై విసుగు చెందిన నెటిజన్‌ అదే అంతర్జాల జీవులలో  ఒకరు ట్విటర్‌ ద్వారా జీహెచ్ఎంసీ కి ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం పిస్తా హౌస్‌ను పరిశీలించిన అధికారులు, ₹ 50000/- జరిమానా విధించారు. (అయితే  అదే మంత పెద్ద విషయం కాదులెండి వారికి) అవసరమైతే ఫుడ్ రెట్లు పెంచేసి మరల మన జనాల్ని వాయించేస్తారు. పాపం! పిర్యాదు చేసిన ఆ 'అంతర్జాలజీవి' కి ఆ విషయం తెలియదు.

.

అంతేకాదు మంగళవారం పలు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పరిశీలించిన అధికారులు కొన్నింటికి భారీస్థాయిలో జరిమానాలు విధించారు. భవన సముదాయంపై ప్రకటన బోర్డు ఏర్పాటు చేసుకున్నందుకు నాగోల్‌ లోని ‘శ్రీనివాస ఫర్నిచర్స్‌’ కు అక్షరాల లక్ష రూపాయలు జరీమానా విధించారు అల్కాపురి ఎక్స్‌ రోడ్డు లోని ‘లక్కీ రెస్టారెంట్‌’ కు సాక్షరాల లక్షన్నర రూపాయిలు జరిమానా విధిస్తూ ‘జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు’ నోటీసులు ఇచ్చారు.

ట్విటర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మరి ఇదే జిహెచ్ఎంసి అధికారులు హైదరాబాదు నగరపాలక ఎన్నికలప్పుడు టాయిలెట్లను కూడా వదలకుండా హోర్దింగులు ఏర్పాటు చేసి అధికార టీఆరెస్ పార్టీకి  సిగ్గులేకుండా ప్రచారం చేసారు. అదే టెలివిజన్లలో ప్రచారం అయిన ఇలాంటి వేల సందర్భాలను పరిగణనలలోకి తీసుకోరా! ది సో కాల్డ్ హైదరాబాదు మహా నగర పాలక ఎన్ఫోర్స్మెంట్ (బలవంతంగా చట్టాలను అమలు చేసే) అధికారులు. వాటిపై చర్యలు తీసుకొనే సామర్ధ్యం లేదా వారికి! పెద్దవాళ్ళని, అధికారంలో ఉన్నవాళ్ళని ఏమి పీకలేరా వీళ్లు!
 
 

మల మూత్రాలు ఆవహించిన మల మూత్ర శాలలు (పబ్లిక్ టాయిలెట్లు) మురికి నాలాలు, చెత్త చెదారం పక్కన ఏర్పాటు చేసిన అనేక ప్రచార చిత్రాల హోర్డింగులపై కేసీఆర్, కేటీఆర్ - అందమైన రెండు ముఖ చిత్రాలతో ఉన్నవాటికీ మాత్రం జరిమానాలు విధించ లేదు. ఆలా చేసి ఉంటె ఈ లెక్కన వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేది.

ఇప్పటికైనా మన మేయర్ మేడం తనకు "ప్రజలంతా సమానం" అని భావించేటట్లైతే వారికీ కూడా జరిమానాలు విధించవచ్చు ఆ పార్టీకి కూడా విధించవచ్చు. సాక్ష్యం కావాలంటే రాజ్-న్యూస్ ఛానల్ వద్ద బోలెడంత సమాచార చిత్రాలు దొరుకుతాయి.  






ప్ర‌భాస్ అభిమానుల‌కు సారీ చెప్పిన నాగ్ అశ్విన్‌... ఎందుకంటే..

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>