MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenae2696bfe-c5dd-41c0-89b4-909ef445dcab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenae2696bfe-c5dd-41c0-89b4-909ef445dcab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉప్పెన ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. దీంతో ఇప్పటివరకు అల్ టైం డెబ్యూ హీరో గా రికార్డులకెక్కాడు.. ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. uppena;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;tamil;remake;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;masterస్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్.. అక్కడ కూడా విజయ్ సేతుపతి తో..?uppena;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;kollywood;tamil;remake;husband;hero;heroine;joseph vijay;vaishnav tej;masterWed, 17 Feb 2021 10:04:32 GMTటాలీవుడ్ లో ఉప్పెన ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తొలి వీకెండ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ఏ డెబ్యూ హీరో రాబట్టలేనన్ని కలెక్షన్లను రాబట్టుకున్నాడు వైష్ణవ్.. దీంతో ఇప్పటివరకు అల్ టైం డెబ్యూ హీరో గా రికార్డులకెక్కాడు.. ఇకపోతే ఈ సినిమా లోని హీరోయిన్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి.. తొలి సినిమా నే అయినా కృతి శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది..

ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన అదరగొట్టింది.. ఆమె నటన చూసిన ఎవరైనాఆమెది ఫస్ట్ సినిమా అంటే నమ్మరు.. సినిమా మొత్తం ఆమె మీద ఉండడంతో వైష్ణవ్ కంటే రెండు మార్కులు ఎక్కువే కొట్టేసింది.. ఈ నేపథ్యంలో సినిమా హిట్ కి తలా చెయ్యి వేసి అదరగొట్టారు. సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతర భాషల నిర్మాతల కన్ను ఈ సినిమా పై పడ్డాయి.. దాంతో తమిళ్లో ఈ సినిమా ను రీమేక్ చేయాలనీ చూస్తున్నారు.. ముఖ్యంగా ఒక స్టార్ హీరో తనయుడు ఉప్పెన ద్వారా పరిచయం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారట.  కానీ విజయ్ సేతుపతి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఉప్పెన లాంటి కథను తమిలో ఉండే వారి వాతావరణానికి తగ్గట్లు తెరపైకి తెస్తేనే బావుంటుందని చెప్పాడట.మంచి కథ కాబట్టి అనవసరంగా డబ్ చేసి వృధా చేయవద్దని విజయ్ సేతుపతి సలహా ఇచ్చాడట. అలాగే విజయ్ సేతుపతిసినిమా తమిళ్ రైట్స్ పై కన్నేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా సరిపోతుందట. అతను మరెవరో కాదు. తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్.విజయ్ కుమారుడు సంజయ్ వయసు ఇప్పుడు 20 ఏళ్ళు. అయితే అతని ఎంట్రీ కోసమే ప్రస్తుతం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సేతుపతి మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ కు కథ గురించి చెప్పాడట. విజయ్ కు కూడా స్టోరీ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదట. మరి సినిమా తమిళ్ లో వస్తే అక్కడి జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.


ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం

కేటీఆర్ ని అడ్డంగా బుక్ చేసిన మహిళా మేయర్..

చంద్రబాబుకు ఏమైంది..ఆ స్వామీజీని అంత మాట అనేశారు..?

జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>