MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunitha0a562127-3c4a-4fbc-92b8-406c4ddcda73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sunitha0a562127-3c4a-4fbc-92b8-406c4ddcda73-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కమ్మని రాగంతో, తీయని మాటతో ప్రేక్షకులను ఇన్నాళ్లు అలరించింది. అయితే తెరపై ఉన్న సంతోషం ఆమె జీవితంలో లేదు.. ఆమె తన మొదటి భర్త తో వివాదాల కారణంగా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా ఆమె భర్తతో విడిగా ఉంటుంది. అయితే కొన్ని రోజులు గడిచాక ఏమనుకుందో ఏమో కానీ ఆమె రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అతి తక్కువ మంది సన్నsunitha;jeevitha rajaseskhar;prema;raaga;ram pothineni;santoshi;tollywood;marriage;love;interview;husband;play back;valentines day;santoshamసునీత పెళ్లి చేసుకోవడం వాళ్ళ పిల్లలకు ఇష్టం లేదా..నిశ్చితార్థం రోజు ఏం జరిగింది..?సునీత పెళ్లి చేసుకోవడం వాళ్ళ పిల్లలకు ఇష్టం లేదా..నిశ్చితార్థం రోజు ఏం జరిగింది..?sunitha;jeevitha rajaseskhar;prema;raaga;ram pothineni;santoshi;tollywood;marriage;love;interview;husband;play back;valentines day;santoshamWed, 17 Feb 2021 23:00:00 GMTటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కమ్మని రాగంతో, తీయని మాటతో ప్రేక్షకులను ఇన్నాళ్లు అలరించింది. అయితే తెరపై ఉన్న సంతోషం ఆమె జీవితంలో లేదు.. ఆమె తన మొదటి భర్త తో వివాదాల కారణంగా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా ఆమె భర్తతో విడిగా ఉంటుంది. అయితే కొన్ని రోజులు గడిచాక ఏమనుకుందో ఏమో కానీ ఆమె రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.  అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఆమె వివాహం చేసుకున్నారు.. టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..  

సునీత కూడా తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి చాలా సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.  గత కొన్ని రోజులుగా రామ్, సునీతల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. పిల్లల అంగీకారంతో, పలువురి పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి జరగగా  ఆమె రెండో వివాహంపై అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఆమె చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి మ్యాటర్ పై గతంలో  పలు సందర్భాల్లో సున్నితంగానే స్పందించిన సునీత అలాంటి సందర్భం వస్తే ముందే చెబుతానని క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఒకరోజు సడన్ గా ఎంగేజ్మెంట్ జరగడంతో అందరూ షాక్ అయ్యారు.  

నిజానికి తమ ఎంగేజ్ మెంట్ ఫొటోస్ముందుగానే బయటకు వచ్చిన విషయం సునీతకు తెలియదట. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు.ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న సునీత నిశ్చితార్థం సంగతి తన పిల్లలకు ఏ మాత్రం తెలియదని కూడా చెప్పేసింది.  ఒక రోజు రామ్ వాళ్ల కుటుంబ సభ్యులు సడన్ గా ఇంటికి వచ్చి తాంబూలం అందించి మా పేరెంట్స్ తో మాట్లాడారు. ఆ విషయం ముందుగా నా పిల్లలకు తెలియదు. అయితే నేను ఒకరోజు సడన్ గా ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కోపంగా ఉన్నట్లు అనిపించింది. నీ లైఫ్ లో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మాకు ఎందుకు చెప్పలేదు. ముందే ఎంగేజ్మెంట్ అని చెబితే మేము కొత్త బట్టలతో రెడీగా ఉండేవాళ్ళం కదా అని నాతో అన్నారు. వాళ్ళు నా పరిస్థితిని ఎంతగానో అర్థం చేసుకున్నారు అని సునీత వివరణ ఇచ్చారు. 


జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>