PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే ముందు నుంచి వైసీపీ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్టుగా సాగిన ఎపిసోడ్లో వారిద్దరూ ఇప్పుడు రాజీ పడ్డారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారం ఎందుకు మొదలయిందో తెలియదు కానీ ఈ ప్రచారం దెబ్బకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఆదేశాలు జారీ చేయాల్సిnimmagadda elections jagan;kumaar;tiru;varsha;jagan;andhra pradesh;kadapa;tirupati;panchayati;husband;pulivendula;ycp;rayachoty;macherlaజగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?nimmagadda elections jagan;kumaar;tiru;varsha;jagan;andhra pradesh;kadapa;tirupati;panchayati;husband;pulivendula;ycp;rayachoty;macherlaWed, 17 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే ముందు నుంచి వైసీపీ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్టుగా సాగిన ఎపిసోడ్లో వారిద్దరూ ఇప్పుడు రాజీ పడ్డారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారం ఎందుకు మొదలయిందో తెలియదు కానీ ఈ ప్రచారం దెబ్బకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మునిసిపల్ ఎన్నికలలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ మీద ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న సాయంత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలా ఫిర్యాదులు తీసుకుని వచ్చే నెల 2వ తేదీలోగా అన్ని ఫిర్యాదులను కమీషన్ కి పంపాలని నిమ్మగడ్డ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

అంతేకాక వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అభ్యర్థిత్వాన్ని నిర్ణయం తీసుకుంటామని ఆ ఆదేశాల్లో ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా నామినేషన్ ఉపసంహరణలు వంటి ఘటనలు జరిగితే ఆ నామినేషన్లు పునరుద్ధరించే అధికారం మాకు ఉంటుందంటూ కూడా ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. అది ఒక్కటే కాక ఇప్పుడు వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దాఖలైన సింగిల్ నామినేషన్ లు మీద కూడా నిమ్మగడ్డ ఫోకస్ పెట్టారు. గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాలలో ఉన్న 6 మున్సిపాలిటీల్లో చాలా వార్డులలో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడం మీద ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక కోరారు. ఈనెల 20వ తేదీలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

 జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు, తిరుపతి వంటి కార్పొరేషన్లలో అధిక భాగం వార్డులలో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మరీ ముఖ్యంగా పులివెందుల, రాయచోటి కార్పొరేషన్లలో 21 వార్డులో , పుంగనూరు 16, పలమనేరు, మాచర్ల లలో 10 వార్డులలో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతిలో కూడా ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురుస్తోంది. తమ అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వకుండా భయపెట్టి బెదిరించి ఇలా సింగిల్ నామినేషన్లు దాఖలు అయ్యేలా చూశారని ఆరోపణలు చేస్తున్న క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీటిమీద ఫోకస్ పెట్టారని చెబుతున్నారు.


తెలుగులో ఈ గొప్ప నటుల పేరు మీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిందట...

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>