PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-birth-day29362c98-6bf8-4c3e-85db-969c271e5d4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-birth-day29362c98-6bf8-4c3e-85db-969c271e5d4b-415x250-IndiaHerald.jpgసీఆర్ పుట్టిన రోజుకు వారం ముందు నుంచే తెలంగాణలో సందడి నెలకొంది. ఈసారి గతంలో కన్నా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఏకంగా గంటలో కోటి మొక్కలు నాటి కేసీఆర్ కు కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.kcr birth day;koti;kcr;kumaar;nagarjuna akkineni;santhosh;telangana rashtra samithi trs;india;santdinesh chandra yadavosh kumar;telangana;joginapally santosh kumar;mp;kanna lakshminarayana;village;chief minister;february;thota chandrasekhar;success;santhossh jagarlapudiకేసీఆర్ బర్త్ డే సందడి! ముందుగానే వేడుకలుకేసీఆర్ బర్త్ డే సందడి! ముందుగానే వేడుకలుkcr birth day;koti;kcr;kumaar;nagarjuna akkineni;santhosh;telangana rashtra samithi trs;india;santdinesh chandra yadavosh kumar;telangana;joginapally santosh kumar;mp;kanna lakshminarayana;village;chief minister;february;thota chandrasekhar;success;santhossh jagarlapudiTue, 16 Feb 2021 19:37:51 GMTతెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం ఫిబ్రవరి 17. కేసీఆర్ పుట్టిన రోజుకు వారం ముందు నుంచే తెలంగాణలో సందడి నెలకొంది. ఈసారి గతంలో కన్నా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఏకంగా గంటలో కోటి మొక్కలు నాటి కేసీఆర్ కు కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం సినీ ప్రముఖులు కూడా  ముందుకు వచ్చారు. కోటి వృక్షార్చనను సక్సెస్ చేసేలా ఎంపీ సంతోష్ కుమార్ అంతా సిద్దం చేశారు.

              కేసీఆర్ బర్త్ డే రోజున మొక్కలు నాటడంతో పాటు రక్తదాన శిబిరాలు కూడా భారీగానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పండ్ల పంపిణి, పేదలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమ కెరటం, ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్.. ఒక రోజు ముందుగానే కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏటా కేసీఆర్ జన్మదినం రోజున వినూత్న కార్యక్రమాలు చేపట్టే బాలరాజు యాదవ్.. ఈసారి కూడా వినూత్నంగానే జరిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 67వ జన్మదినం కావడంతో..  నాగార్జున సాగర్ నందికొండలోని బుద్దవనంలో  67మొక్కలు నాటారు బాలరాజు యాదవ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్రృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కోటి వ్రృక్షార్ఛన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందస్తుగా హరిత జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే ఉప ఎన్నిక జరగనుండటంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈసారి కేసీఆర్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.





అబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>