MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabfb93cc4b-0e00-4ef2-9529-879e8ceac2b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saabfb93cc4b-0e00-4ef2-9529-879e8ceac2b2-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కలిసి తొలిసారిగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అంజలి, నివేదాథామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా యువ సంగీత సంచలనం తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. vakeel-saab;women;pawan;ananya pandey;boney kapoor;prakash raj;shruti haasan;ananya;anjali;geetha;kalyan;pawan kalyan;raj;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;producer;audience;remake;producer1;letter;success;pink;yuva;march;dil;ananya nagallaవామ్మో .... ఒక్క పాట కోసం ఏడాది టైం తీసుకున్నారా .....??వామ్మో .... ఒక్క పాట కోసం ఏడాది టైం తీసుకున్నారా .....??vakeel-saab;women;pawan;ananya pandey;boney kapoor;prakash raj;shruti haasan;ananya;anjali;geetha;kalyan;pawan kalyan;raj;thaman s;bollywood;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;producer;audience;remake;producer1;letter;success;pink;yuva;march;dil;ananya nagallaTue, 16 Feb 2021 20:30:44 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కలిసి తొలిసారిగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అంజలి, నివేదాథామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా యువ సంగీత సంచలనం తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

ఇటీవల రిలీజైన ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మగువ మగువ అనే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు పెంచాయి. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకున్న పింక్ అనే కోర్టు డ్రామా సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీ ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 9న గ్రౌండ్ లెవల్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ నుండి రెండో సాంగ్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. రెండు రోజుల క్రితం తమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. మార్చి 8 న అందరూ సిద్ధంగా ఉండండి అంటూ పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించే తమన్ ఒక పోస్ట్ పెట్టాడు. 

ఆరోజు వరల్డ్ ఉమెన్స్ డే కావడంతో మహిళల గొప్పతనాన్ని ఉద్దేశించి రూపొందించిన సెకండ్ సాంగ్ ని ఆ రోజున రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట యూనిట్. అయితే మొదటి సాంగ్ రిలీజ్ సరిగ్గా మార్చి 8 కి ఏడాది పూర్తి అవడం గమనార్హం. మళ్లీ అదే రోజున సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుండటంతో కేవలం ఒకే ఒక్క పాట కోసం ఏడాది సమయం తీసుకున్న సినిమా బహుశా ఇదొక్కటే అనుకుంట అంటూ పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ తర్వాత వకీల్ సాబ్ ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరో రెండు నెలల వరకు వెయిట్ చేయక తప్పదు......!!


అబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>