Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankar-revealed-the-gener-of-the-movie-with-ram-charan1400a906-facd-48bd-b1a9-7d5b47db85de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sankar-revealed-the-gener-of-the-movie-with-ram-charan1400a906-facd-48bd-b1a9-7d5b47db85de-415x250-IndiaHerald.jpgడైనమిక్ డైరెక్టర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ వంటి హిస్టారికల్ మూవీ చేస్తున్న రామ్‌చరణ్ ఇప్పడు తన నెక్ట్స్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న చెర్రీ తన తరువాతి సినిమాలో అంతకుమించి కనిపించాలని..sankar charan;gowtam;shankar;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;twitter;genre;producer;interview;director;producer1;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;sirish;chitramచెర్రీతో సినిమా ఏ జోనర్‌లో ఉండబోతోందో శంకర్ చెప్పేశాడా..!చెర్రీతో సినిమా ఏ జోనర్‌లో ఉండబోతోందో శంకర్ చెప్పేశాడా..!sankar charan;gowtam;shankar;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;twitter;genre;producer;interview;director;producer1;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;sirish;chitramTue, 16 Feb 2021 22:23:12 GMT" style="height: 209px;">ఇంటర్నెట్ డెస్క్: డైనమిక్ డైరెక్టర్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ వంటి హిస్టారికల్ మూవీ చేస్తున్న రామ్‌చరణ్ ఇప్పడు తన నెక్ట్స్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న చెర్రీ తన తరువాతి సినిమాలో అంతకుమించి కనిపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తదుపరి మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కబోతోంది. ఇంతవరకు మనకు తెలిసిన విషయమే అయినా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో సంచలన విషయం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

శంకర్-చెర్రీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతోంది..? ఈ సినిమా ఏ జోనర్‌లో ఉంటుంది..? అనే సందేహాలు సగటు సినీ ప్రేక్షకులందరికీ కలుగుతున్నాయి. అయితే ఈ సందేహాలలో కొన్నింటికి శంకర్ క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.  అది కూడా ఇప్పుడు కాదు.. ఎప్పుడో చెప్పేశారట. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శంకర్‌.. ఇండియన్‌-2 తర్వాత తాను ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కథను సిద్ధం చేశానని చెప్పిన వీడియోను ఇప్పుడు మెగా ఫ్యాన్స్ బయటకు తీశారు.

అప్పటి శంకర్ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ రీ ట్వీట్స్‌ చేస్తూ.. ఇదే చెర్రీ-శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా జోనర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శంకర్-చెర్రీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం తరువాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్‌ మరో సినిమా చేయబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.






ఉప్పెన సూపర్ హిట్.. క్రిష్ సినిమాకు క్రేజ్ తెచ్చిన వైష్ణవ్ తేజ్..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>