MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviesff2d63b0-e533-468a-8ba4-862431b91882-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviesff2d63b0-e533-468a-8ba4-862431b91882-415x250-IndiaHerald.jpgమూడు సినిమాట షూటింగ్‌లు.. ఆరు సినిమాల విడుద‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల్సిన తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఇక్క‌డి క‌థానాయ‌కుల వ్యాపార ధోర‌ణితో వెల‌వెల‌బోతోంది. భారీ రెమ్యున‌రేష‌న్‌తోపాటు భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు చేయ‌డానికి అల‌వాటుప‌డ్డ మ‌న క‌థానాయ‌కుల‌కు చిత్రంలోని ప్ర‌తి ఫ్రేమ్ ఖ‌రీదైందిగా క‌న‌ప‌డాలి. క‌రోనా లాంటి విప‌త్తులు ఎన్ని వ‌చ్చినా క‌థ డిమాండ్ చేస్తోందంటూ అమెరికా, ఇట‌లీ లాంటి దేశాల్లోనే షూటింగ్‌లు జ‌ర‌గాలి. నిర్మాత‌కు బ‌డ్జెట్ పెర‌గాలి. కుటుంబ స‌మేతంగా విహార‌యాత్ర చేసిన‌ట్లు ఉండాలి. movies;american samoa;tollywood;cinema;hollywood;corporate;chitramక‌థానాయ‌కుల వ్యాపార ధోర‌ణిక‌థానాయ‌కుల వ్యాపార ధోర‌ణిmovies;american samoa;tollywood;cinema;hollywood;corporate;chitramTue, 16 Feb 2021 18:56:41 GMTమూడు సినిమాట షూటింగ్‌లు.. ఆరు సినిమాల విడుద‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడాల్సిన తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ఇక్క‌డి క‌థానాయ‌కుల వ్యాపార ధోర‌ణితో వెల‌వెల‌బోతోంది. భారీ రెమ్యున‌రేష‌న్‌తోపాటు భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు చేయ‌డానికి అల‌వాటుప‌డ్డ మ‌న క‌థానాయ‌కుల‌కు చిత్రంలోని ప్ర‌తి ఫ్రేమ్ ఖ‌రీదైందిగా క‌న‌ప‌డాలి. క‌రోనా లాంటి విప‌త్తులు ఎన్ని వ‌చ్చినా క‌థ డిమాండ్ చేస్తోందంటూ అమెరికా, ఇట‌లీ లాంటి దేశాల్లోనే షూటింగ్‌లు జ‌ర‌గాలి. నిర్మాత‌కు బ‌డ్జెట్ పెర‌గాలి. కుటుంబ స‌మేతంగా విహార‌యాత్ర చేసిన‌ట్లు ఉండాలి. నిజ‌జీవితంలోకాకుండా తెర‌మీద మాత్ర‌మే క‌థానాయ‌కులైన మ‌న‌వారి ధోర‌ణివ‌ల్ల హాలీవుడ్ స్థాయికి దిన‌దినాభివృద్ది చెందాల్సిన టాలీవుడ్ ఐదునిముషాలు, ప‌దినిముషాల నిడివి ఉండే డాక్యుమెంట‌రీలు తీసే స్థాయికి కుచించుకుపోతోంది.

సొంత‌లాభం కొంత మానుకొని తోటివారికి సాయ‌ప‌డ‌వోయ్ అన్నారు గుర‌జాడ‌. సినిమా ఆల‌స్యంగా విడుద‌లైతే దానిమీద విప‌రీమైన క్రేజ్ వ‌స్తుంది.. అన్ని ర‌కాల హ‌క్కుల‌మీద సొమ్ములు స‌మ‌కూరుతాయి.. వారం, రెండువారాల్లో క‌లెక్ష‌న్స్ లాగేస్తే స‌రిపోతుంది అనే అర్థం ప‌ర్థం లేని లెక్క‌ల‌మీద ఆధార‌ప‌డి ప్ర‌స్తుత సినిమాలు వి‌డుద‌ల‌వుతున్నాయి. ప్ర‌తి క‌థానాయ‌కుడు త‌న క్షేమంతోపాటు 24 విభాగాల్లోని కార్మికుల క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలైన చేస్తుంటే అంద‌రికీ పుష్క‌లంగా ఉపాధి ల‌భిస్తుంద‌నేది సినీ ప్రేమికుల ఆవేద‌న‌. ఒక సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌క‌పోయినా త‌ర్వాత వ‌చ్చే సినిమా అయినా మెప్పిస్తుంద‌నే ఆశ ఉంటుంది. కొనుగోలుకు బ‌య్య‌ర్లు ముందుకు వ‌స్తారు. ప్ర‌జ‌ల్లో క‌థానాయ‌కుడి పేరు నానుతూనే ఉంటుంది. అదే సంవ‌త్స‌రానికో, రెండు సంవ‌త్స‌రాల‌కో ఒక సినిమా వ‌స్తే అది మెప్పిస్తుందో లేదో ఆ క‌థానాయ‌కులు, ద‌ర్శ‌కుల‌కే అర్థంకాదు. క‌న్న‌త‌ల్లి లాంటి సినీ ప‌రిశ్ర‌మ‌, దానిమీద ఆధార‌ప‌డి జీవించేవారు, త‌మ‌తో సినిమాలు నిర్మించే నిర్మాత‌ల‌క‌న్నా పారితోషికం, కార్పొరేట్ కంపెనీల‌కు ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ‌చ్చే ఆదాయం, ఇత‌ర‌త్రా వ్యాపారాల‌మీద దృష్టిసారించ‌డం మానుకోవాల‌ని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. రూపాయి సంపాద‌న అనేది త‌ప్పు లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌మ పునాది సినీ ప్రేమికులు, త‌మ అభిమానుల‌పై ఆధార‌ప‌డివుంద‌నే విష‌యం గుర్తుంచుకోవాల‌ని, ప్ర‌తి క‌థానాయ‌కుడు సినీ ప‌రిశ్ర‌మ శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకోవాల‌ని అభిమానులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.


ఛీ.. వీళ్లసలు మనుషులేనా.. అలా చేస్తుందని మహిళపై యువకుడిని కూర్చోబెట్టి ఇలా ఊరేగిస్తారా?

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>