TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shiva-jyothi553976bd-bd82-484c-ad3d-8b6a571f517c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shiva-jyothi553976bd-bd82-484c-ad3d-8b6a571f517c-415x250-IndiaHerald.jpgశివజ్యోతి.. తెలంగాణ యాసలో తీన్ మార్ వార్తలతో రాష్ట్రంలో ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లోకి కంటెస్టెంట్ గా కొత్త అవతారం ఎత్తింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. బిగ్ బాస్ షోతో ఆమె పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి.shiva jyothi;ali;telangana;sivajyothi;bigboss;february;allu sneha;oh babyతల్లి కాబోతున్న బిగ్ బాస్ శివజ్యోతి..అలీ రేజా చెప్పకనే చెప్పాడా..?తల్లి కాబోతున్న బిగ్ బాస్ శివజ్యోతి..అలీ రేజా చెప్పకనే చెప్పాడా..?shiva jyothi;ali;telangana;sivajyothi;bigboss;february;allu sneha;oh babyTue, 16 Feb 2021 09:27:34 GMTతెలంగాణ యాసలో తీన్ మార్ వార్తలతో రాష్ట్రంలో ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 3లోకి కంటెస్టెంట్ గా కొత్త అవతారం ఎత్తింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. బిగ్ బాస్ షోతో ఆమె పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి.

బిగ్ బాస్ షో లో శివజ్యోతికి కొత్త కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. బిగ్ బాస్ అయి పోయిన తర్వాత కూడా ఈ స్నేహం కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా అలీ రెజా కి, శివజ్యోతికి మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. శివజ్యోతి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా.. అలీ రెజా తన భార్యతో వస్తుంటాడు. ఫిబ్రవరి 14న శివజ్యోతి పుట్టిన రోజు. ఆమె బర్త్ డేను అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. అలీ రెజా ఈ వేడుకలకు ఆలస్యంగా వచ్చాడు. ఇదే సమయంలో శివజ్యోతిని అలీ ఆశీర్వదించాడు.

అయితే శివజ్యోతికి అలీ చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఆయన మాటలను బట్టి శివజ్యోతి తల్లికాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. మనం ఓ తల్లి కడుపున పుట్టకపోయినా.. మన ఇద్దరి ఆత్మలు ఒకటే అని నమ్ముతాను. హ్యాపీ బర్త్ డే అక్కా .. నీకు మరిన్ని సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను. విజయాలు దక్కాలని కోరుకుంటున్నా. అంతేకాదు త్వరలోనే ఓ బేబీ వస్తుందని ఆశిస్తున్నానంటూ అలీ శివజ్యోతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. దీన్ని బట్టి శివజ్యోతి తల్లి కాబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నో కష్టాలు పడి చివరకి ఈ స్థితికి చేరుుకున్నశివజ్యోతి.. ఇప్పుడు తల్లికాబోతుందనే వార్త సంతోషం నింపింది. తనకష్టంతో ఓ ఇల్లు, కారు కొనుక్కున్న శివజ్యోతి.. తల్లి కాబోతుందనే వార్త అందరికీ సంతోషాన్నిస్తుంది.  ఆమె ఇంట్లో సందడి మొదలైంది. శివజ్యోతి తల్లి కాబోతుందా.. అని ఆమె అభిమానులు వెరిఫై చేసుకుంటున్నారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


జగడ్డ : విశాఖలో పంచాయతీకి మావోల షాక్...?

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>