PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/what-happened-night-after-night-ycp-vision-is-all-yoursf4fe77bd-1e93-4e7a-b74e-c92a38e166df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/what-happened-night-after-night-ycp-vision-is-all-yoursf4fe77bd-1e93-4e7a-b74e-c92a38e166df-415x250-IndiaHerald.jpg క‌ల‌క‌డ మండ‌లంలో 16 పంచాయ‌తీల‌కు టీడీపీ ఏడు చోట్ల విజ‌యం సాధించింది. దొడ్డిపల్లె, దేవలపల్లె, రాతిగుంటపల్లె, నవాబ్‌పేట, కదిరాయచెరువు, బాటవారిపల్లె, బాలయ్యగారిపల్లె పంచాయతీలను ఆ పార్టీ అభ్యర్థులు గెలుచుకోగా వీటిలో నవాబ్‌పేట టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి శివప్రసాద్‌ నాయుడు జైలులో వుండి కూడా 56 ఓట్లతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపారు. కలికిరి మండలంలో మొత్తం 14 పంచాయతీలుంటే కిషోర్‌కుమార్‌రెడ్డి సొంత పంచాయతీ పత్తేగడ సహా గుండ్లూరు, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె, మర్రికుంటపల్లె తదితర ఐదు పంచాయతీchandra babu ysrcp;kishore kumar;kumaar;panchayati;mandalam;letter;tdp;ycp;pileru;reddy;partyమాజీ సీఎం ఇలాకాలో టీడీపీ జోరుకు ఫ్యాన్ బేజారైందే ?మాజీ సీఎం ఇలాకాలో టీడీపీ జోరుకు ఫ్యాన్ బేజారైందే ?chandra babu ysrcp;kishore kumar;kumaar;panchayati;mandalam;letter;tdp;ycp;pileru;reddy;partyTue, 16 Feb 2021 14:54:26 GMTమాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఆయ‌న సోద‌రుడు టీడీపీ ఇంచార్జ్ న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి త‌న ప‌ట్టు నిలుపుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కిర‌ణ్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ జ‌రిగిన 76 పంచాయ‌తీల‌కు గాను 23 పంచాయ‌తీల్లో టీడీపీ సానుభూతిప‌రులు విజ‌యం సాధించారు. చింత‌ప‌ర్తి మేజ‌ర్ పంచాయ‌తీ సైతం టీడీపీ ఖాతాలోనే ప‌డింది. ఇక వీరి సొంత మండ‌లం అయిన క‌లికిరిలో అన్ని పంచాయ‌తీల‌కు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కిషోర్ కుమార్ రెడ్డి పోటీ పెట్టారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌ సొంత పంచాయతీ కలకడ మండలం దొడ్డిపల్లెలో తీవ్ర పోటీ నడుమ సోదరుడు నాగరాజ నాయుడిని గెలిపించుకుని స‌త్తా చాటుకున్నారు. క‌ల‌క‌డ మండ‌లంలో 16 పంచాయ‌తీల‌కు టీడీపీ ఏడు చోట్ల విజ‌యం సాధించింది. దొడ్డిపల్లె, దేవలపల్లె, రాతిగుంటపల్లె, నవాబ్‌పేట, కదిరాయచెరువు, బాటవారిపల్లె, బాలయ్యగారిపల్లె పంచాయతీలను ఆ పార్టీ అభ్యర్థులు గెలుచుకోగా వీటిలో నవాబ్‌పేట టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి శివప్రసాద్‌ నాయుడు జైలులో వుండి కూడా 56 ఓట్లతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపారు.

కలికిరి మండలంలో మొత్తం 14 పంచాయతీలుంటే కిషోర్‌కుమార్‌రెడ్డి సొంత పంచాయతీ పత్తేగడ సహా గుండ్లూరు, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె, మర్రికుంటపల్లె తదితర ఐదు పంచాయతీల్లో టీడీపీ గెలిచింది. గుర్రంకొండ మండలంలో ఐదు పంచాయతీల్లో టీడీపీ గెలిచింది. కంభంవారిపల్లె మండలంలో 19 పంచాయతీలుంటే మూడు పంచాయతీలను టీడీపీ కైవసం చేసుకుంది. వాల్మీకిపురం మండలంలో 16 పంచాయతీలుండగా మంచూరు, చింతపర్తిల్లో టీడీపీ గెలిచింది. ఏదేమైనా జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వర్గాల్లో వైసీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించినా దానికి పీలేరులో మాత్రం కిషోర్  కుమార్ రెడ్డి అడ్డుక‌ట్ట వేసి త‌న ఫ్యామిలీ ప‌ట్టు నిలుపుకున్నారు. 


ఒక అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నా.. మే నెలలో పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>