PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgఆయా సామాజిక వ‌ర్గాల అసంతృప్తుల‌ను త‌గ్గిస్తార‌ని.. గ‌తంలో ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కారుపై ఒకింత వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. సామాజిక వ‌ర్గాల వ్యూహాన్ని త‌న కేబినెట్‌లో అమ‌లు చేశారు. ప్ర‌తి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌భు త్వం ఒక్కొక్క‌సారి.. ఆయా సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. మంత్రులు మేనేజ్ చేస్తార‌ని జగ‌న్ అప్ప‌ట్లోనే చెప్పారు. ఇక ఇదే వ‌ర్గం నుంచి మంత్రులుగా ఉన్న అవంతి శ్రీనివాస్‌కు స్థానికంగానే జిల్లాలో ప్ర‌యార్టీ ఉండడం ysrcp;view;nani;krishna river;indiaherald group;rbi;deputy chief minister;avanthi srinivas;smart phone;cm;mla;minister;press;letter;local language;kakinada;youth;mantraకాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?ysrcp;view;nani;krishna river;indiaherald group;rbi;deputy chief minister;avanthi srinivas;smart phone;cm;mla;minister;press;letter;local language;kakinada;youth;mantraTue, 16 Feb 2021 09:06:00 GMTజ‌గ‌న్ కేబినెట్‌లో కాపు సామాజిక వ‌ర్గానికి మంచి ప్రాతినిధ్య‌మే ద‌క్కింది. కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు,  ఏలూరు నుంచి గెలుపొందిన ఆళ్ల నానిల‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో మంచి పొజిష‌న్ ద‌క్కింది. ఏకంగా ఆళ్ల నాని అయితే.. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. క‌న్న‌బాబు వ్య‌వ‌సాయ మంత్రిగా ఉన్నారు. వీరిలో క‌న్న‌బాబు ఫైర్ బ్రాండ్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇక‌, ఆళ్ల‌నాని సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌న‌దైన పంథాలో రాజ‌కీయం చేస్తున్నారు.

ఇక‌, జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు దాదాపు ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక మంచి ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఆయా సామాజిక వ‌ర్గాల అసంతృప్తుల‌ను త‌గ్గిస్తార‌ని.. గ‌తంలో ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి అప్ప‌టి  చంద్ర‌బాబు స‌ర్కారుపై ఒకింత వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. సామాజిక వ‌ర్గాల వ్యూహాన్ని త‌న కేబినెట్‌లో అమ‌లు చేశారు. ప్ర‌తి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌భు త్వం ఒక్కొక్క‌సారి.. ఆయా సామాజిక వ‌ర్గాల‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. మంత్రులు మేనేజ్ చేస్తార‌ని జగ‌న్ అప్ప‌ట్లోనే చెప్పారు.

ఇక ఇదే వ‌ర్గం నుంచి మంత్రులుగా ఉన్న అవంతి శ్రీనివాస్‌కు స్థానికంగానే జిల్లాలో ప్ర‌యార్టీ ఉండడం లేదంటున్నారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన కాపు మంత్రి పేర్ని నానిని ప్ర‌భుత్వం ప్రెస్ మీట్ల‌కు వాడుకోవ‌డం మిన‌హా ఆయ‌న కూడా త‌న సామాజిక వ‌ర్గానికి చేస్తేందేమి లేద‌ని ఆ వర్గం నేత‌లే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి ఎదుర‌వుత‌న్న స‌మ‌స్య‌ల‌కు ఆయా మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. అయితే.. కాపు సామాజిక వ‌ర్గం విష‌యంలో మాత్రం ఈ ఇద్ద‌రు ఫుల్లు సైలెంట్ గా ఉన్నారు. కాపు యువ‌త వ‌చ్చి.. ఏదైనా స‌మ‌స్య చెప్పుకొందామ‌ని అనుకున్నా.. త‌మ‌కు సంబంధం లేద‌ని.. కార్పొరేష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌ని సూచించి చేతులు దులుపుకొంటున్నార‌న్న చ‌ర్చ‌లు సొంత సామాజిక వర్గంలోనే వినిపిస్తున్నాయి.

పోనీ అక్క‌డ‌కు వెళ్లినా.. అక్క‌డ స్పందించేవారు ఎవ‌రూ లేర‌ని కాపు యువ‌త తల‌లు ప‌ట్టుకుంటోంది. మ‌రి కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన మంత్రులు ఉన్నా వేస్టే.. అనే కామెంట్లు వినిపించ‌క ఏమ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>