MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-special-show-for-mahesh-babu-familyd5f116bb-6642-4139-97c9-bd2493779383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-special-show-for-mahesh-babu-familyd5f116bb-6642-4139-97c9-bd2493779383-415x250-IndiaHerald.jpgమెగా యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఉప్పెన.. బుచ్చి బాబు సన దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మంచి సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకుని ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. mahesh-babu;mahesh;devi sri prasad;prasad;rashmika mandanna;sethu;vijay;vijay sethupathi;apherald;tollywood;cinema;rajani kanth;media;love;husband;hero;letter;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;panjaa;love storyఅబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??అబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??mahesh-babu;mahesh;devi sri prasad;prasad;rashmika mandanna;sethu;vijay;vijay sethupathi;apherald;tollywood;cinema;rajani kanth;media;love;husband;hero;letter;heroine;success;joseph vijay;yuva;mythri movie makers;vaishnav tej;panjaa;love storyTue, 16 Feb 2021 20:35:37 GMTమెగా యువ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఉప్పెన.. బుచ్చి బాబు సన దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మంచి సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకుని ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. 

ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ గా మంచి కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన విధానం అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్స్ అయిన వైష్ణవ్ తేజ్,కృతి ఇద్దరి ఆకట్టుకునే నటన, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వండర్ఫుల్ సాంగ్స్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,  గ్రాండియర్ గా అదరగొట్టిన నిర్మాతల నిర్మాణాత్మక విలువలు, మరీ ముఖ్యంగా సినిమాలో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి అత్యద్భుత నటన వెరసి ఈ మూవీకి ఇంత మంచి టాక్ తీసుకువచ్చాయి. ఇక ఏ, బి, సి సెంటర్స్ అనేటువంటి తేడాలేకుండా దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా పై పలువురు సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల నటి రష్మిక మందన్నమూవీ గురించి పాజిటివ్ గా స్పందిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ఒక లో పోస్ట్ చేసింది. 

అలానే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ, ఉప్పెన మూవీ గురించి ఎంతో విన్నాను సూపర్ హిట్ కొట్టిన ఆ మూవీ యూనిట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అతి త్వరలో సినిమా చూస్తాను అంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ బాబు ఫ్యామిలీ కోసం అతి త్వరలో ప్రత్యేకంగా ఉప్పెన మూవీ స్పెషల్ షోనీ నిర్మాతలు ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమాపై మహేష్ ఏ విధంగా స్పందిస్తారు అనేది అందరిలోనూ కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ మూవీ చూసిన తర్వాత మహేష్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాలి.....!!


బిడ్డ కోసం వీర్యం గడ్డ కట్టించి.. తల్లి, తండ్రి ఒకరే కాబోతోంది..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>