PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sharmila-big-announcement-on-that-day5ce9983b-1d7c-495f-9e81-48a8efcc9a02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sharmila-big-announcement-on-that-day5ce9983b-1d7c-495f-9e81-48a8efcc9a02-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి రాజకీయ వర్గాలు అన్నీ కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. దాదాపుగా వారం రోజుల నుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి జిల్లాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. నల్గొండ ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్సార్ అభిమానులు గా చెప్పుకుని వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన చాలా మంది నేతలతో ఆమె ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాను పsharmila;pawan;kcr;kalyan;andhra pradesh;y. s. rajasekhara reddy;telugu;media;nalgonda;ycp;partyపవన్ కు జరిగిన అన్యాయమే షర్మిలకు జరుగుతుందా...?పవన్ కు జరిగిన అన్యాయమే షర్మిలకు జరుగుతుందా...?sharmila;pawan;kcr;kalyan;andhra pradesh;y. s. rajasekhara reddy;telugu;media;nalgonda;ycp;partyTue, 16 Feb 2021 17:06:48 GMTపార్టీ పెట్టే అంశం గురించి రాజకీయ వర్గాలు అన్నీ కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. దాదాపుగా వారం రోజుల నుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి జిల్లాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. నల్గొండ ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్సార్ అభిమానులు గా చెప్పుకుని వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన చాలా మంది నేతలతో ఆమె ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

తాను పార్టీ పెట్టే అంశం గురించి కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఆమెను మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముందు నుంచి కూడా ఆమె పార్టీ పెడుతున్నారని చెప్పిన ఒక మీడియా మినహా మిగిలిన చానల్స్ ఏవి కూడా ఆమె ను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి. వాస్తవానికి తెలంగాణలో ఉన్న మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి దాదాపుగా 4, 5 ఏళ్ల నుంచి భయపడుతూనే ఉంది.

షర్మిల కేసీఆర్ పై పోరాటం చేస్తున్నారు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే కేసీఆర్ కి కోపం వస్తుంది అని భావించి ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా సైలెంట్ అయ్యారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరిగింది అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్ చేస్తున్న పర్యటనలకు సంబంధించి అప్పటి వైసిపి అనుకూల మీడియా గానీ తెలుగుదేశం అనుకూల మీడియా గానీ పెద్దగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేయ లేదు. ఇప్పుడు షర్మిల విషయంలో కూడా దాదాపు అదే జరుగుతున్నది. దీనితో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే షర్మిల మీటింగ్ గురించి మీడియాలో వార్తలు వస్తాయో లేదో చూడాలి.


చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>