PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/apc4a7b505-b456-4295-9d14-cdc2daa7dc8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/apc4a7b505-b456-4295-9d14-cdc2daa7dc8f-415x250-IndiaHerald.jpg ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్నాయ‌ని అనుకుంటే మీరు పొర‌బ‌డ్డ‌ట్లే. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్యే జ‌రుగుతున్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. తాజాగా వీరి మ‌ధ్య పోరు మ‌రో ద‌శ‌కు చేరింది. పంచాయితీ ఎన్నిక‌ల్లో బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన నిమ్మ‌గ‌డ్డ ఇప్పుడు పుర‌పాలిక‌ల‌పై దృష్టిసారించారు. ap;kumaar;tiru;andhra pradesh;telugu;panchayati;local language;partyనిమ్మ‌గ‌డ్డ నిర్ణ‌యం వ‌ర‌మా? శాప‌మా?నిమ్మ‌గ‌డ్డ నిర్ణ‌యం వ‌ర‌మా? శాప‌మా?ap;kumaar;tiru;andhra pradesh;telugu;panchayati;local language;partyTue, 16 Feb 2021 20:16:31 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్నాయ‌ని అనుకుంటే మీరు పొర‌బ‌డ్డ‌ట్లే. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్యే జ‌రుగుతున్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. తాజాగా వీరి మ‌ధ్య పోరు మ‌రో ద‌శ‌కు చేరింది. పంచాయితీ ఎన్నిక‌ల్లో బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన నిమ్మ‌గ‌డ్డ ఇప్పుడు పుర‌పాలిక‌ల‌పై దృష్టిసారించారు. పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో గ‌తంలో బ‌ల‌వంతంగా నామినేష‌న్లు ఉప‌సంహ‌రించిన‌చోట చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. వాటిని పున‌రుద్ధ‌రించాల‌ని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణ‌యం వైసీపీకి లాభ‌మా?  తెలుగుదేశం పార్టీకి లాభ‌మా? అనేది  త్వ‌ర‌లోనే తేల‌నుంది.

ఏపీ పంచాయతీ ఎన్నిక‌ల అనంత‌రం  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. సిద్ధ‌మ‌వుతూనే అధికార ప్ర‌భుత్వానికి ఒక షాకిచ్చారు. గ‌తంలో ఎన్నిక‌లు ఆగిన‌చోట నుంచే నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో పుర‌పాల‌క‌‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఉండదు. దీంతో అధికార పార్టీ అభ్య‌ర్థులు త‌మ ప్రత్యర్ధులతో నామినేషన్లు ఉప‌సంహ‌రించేలా బేర‌సారాల‌కు దిగుతుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా జ‌రిగేది ఇదే. గతంలో ఏపీలో వాయిదా పడిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈసారి మాత్రం వాటి గురించి ప్రస్తావించకుండా తొలుత మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల చేశారు. అయితే విప‌క్షాల నుంచి అభ్యంత‌రాలు రావ‌డంతో బ‌ల‌వ‌తంగా నామినేస‌న్ల ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగిన‌చోట వాటిని పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నామినేష‌న్ల‌ను బ‌ల‌వంతంగా ఉప‌సంహ‌రించ‌డ‌మ‌నేలా చేయ‌డ‌మ‌నేది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని, ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా నిర్వ‌హించే దృక్ప‌థంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించారు. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సి ఉంది!!. ఎవ‌రెలాంటి నిర్ణ‌యం తీసుకున్నా, ఎవ‌రెలా వ్య‌వ‌హ‌రించినా అంతిమంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారే ప్ర‌జాభిమానం చుర‌గొన్న‌ట్లు. రెండు ద‌శ‌ల్లో విడుద‌లైన పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇదే విష‌యాన్ని రుజువు చేశాయి.






బిడ్డ కోసం వీర్యం గడ్డ కట్టించి.. తల్లి, తండ్రి ఒకరే కాబోతోంది..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>