PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpgఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలిసిన తెదేపా నేతలు బోండా ఉమా,ఆలపాటి రాజా,అశోక్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ఎస్ఈసీకి,హైకోర్టు దృష్టికి ఆగడాలను తీసుకెళ్లినా చర్యలు లేవు అని మండిపడ్డారు. రోజురోజుకూ వైకాపా నేతల దౌర్జన్యాలు పెరుగుతున్నాయి అని అన్నారు. కడప జిల్లా సింహాద్రిపురంలో పోటీ చేస్తోన్nimmagadda;women;amala akkineni;kumaar;ashok;raja;bonda;district;kadapa;government;police;srikalahasti;panchayati;woman;tdp;pulivendula;rayachoty;macherlaనిమ్మగడ్డ వద్దకు టీడీపీ... ఎందుకు...?నిమ్మగడ్డ వద్దకు టీడీపీ... ఎందుకు...?nimmagadda;women;amala akkineni;kumaar;ashok;raja;bonda;district;kadapa;government;police;srikalahasti;panchayati;woman;tdp;pulivendula;rayachoty;macherlaTue, 16 Feb 2021 17:31:32 GMTకుమార్ ని కలిసిన తెదేపా నేతలు బోండా ఉమా,ఆలపాటి రాజా,అశోక్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ఎస్ఈసీకి,హైకోర్టు దృష్టికి ఆగడాలను తీసుకెళ్లినా చర్యలు లేవు అని మండిపడ్డారు. రోజురోజుకూ వైకాపా నేతల దౌర్జన్యాలు పెరుగుతున్నాయి అని అన్నారు.

కడప జిల్లా సింహాద్రిపురంలో పోటీ చేస్తోన్న ఒ మహిళ చీనితోటను నరికేశారు అని మండిపడ్డారు. పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్ల, శ్రీకాళహస్తి, రాయచోటి, తంబళ్లపల్లి లో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి అని ఆరోపణలు చేసారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లూ వైకాపా ప్రభుత్వంలో ఏకగ్రీవాలు ఎందుకు  అవుతున్నాయి అని నిలదీశారు. పోలీసులు వైకాపా ప్రభుత్వానికి జీ హుజూర్ అనడంతోనే ఇష్టాను సారం ఏకగ్రీవాలు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. దౌర్జన్యకర పరిస్థితులను ఇప్పటికైనా వైకాపా విడనాడాలి అని కోరారు.

కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరాం అని తెలిపారు.  రాజ్యాంగబద్ద వ్యవస్థలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలను ఎస్ఈసీ దృష్టికి తెచ్చాం అని ఆయన వివరించారు. ఏకగ్రీవాలు రద్దు చేసి ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరాం అని అన్నారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రీ నోటిఫికేషన్ చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీ ని కోరాం  అని వివరించారు. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది అన్నారు. మున్సిపాలిటీ, నగరపలికల్లో నామినేషన్లు వేసుకునేందుకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీ ని కోరాం అని ఆయన అన్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులు చనిపోయారు, మరికొన్ని చోట్ల అస్వస్తతకు గురయ్యారు అని తెలిపారు.  చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు అని వివరించారు.


చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>