Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-transgender-freezes-semen-to-become-mother-and-father-to-a-child5c35cda8-9497-4b24-a599-b165a1da15e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-transgender-freezes-semen-to-become-mother-and-father-to-a-child5c35cda8-9497-4b24-a599-b165a1da15e7-415x250-IndiaHerald.jpgసృష్టిలో ఊహించని అనేక పనులను ప్రస్తుతం మానవుడు చేయాలనుకుంటున్నాడు. అలాంటి ఓ విచిత్రమైన పనికే గుజరాత్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ పూనుకుంది. బిడ్డకు తండ్రిలా వీర్యం అందించి, తల్లిలా గర్భం ధరించి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతోంది. అవును మీరు విన్నది నిజమే....transgender;women;anand malayalam actor;university;doctor;central government;stree;father;anand deverakondaబిడ్డ కోసం వీర్యం గడ్డ కట్టించి.. తల్లి, తండ్రి ఒకరే కాబోతోంది..!బిడ్డ కోసం వీర్యం గడ్డ కట్టించి.. తల్లి, తండ్రి ఒకరే కాబోతోంది..!transgender;women;anand malayalam actor;university;doctor;central government;stree;father;anand deverakondaTue, 16 Feb 2021 20:44:15 GMTఇంటర్నెట్ డెస్క్: సృష్టిలో ఊహించని అనేక పనులను ప్రస్తుతం మానవుడు చేయాలనుకుంటున్నాడు. అలాంటి ఓ విచిత్రమైన పనికే గుజరాత్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ పూనుకుంది. బిడ్డకు తండ్రిలా వీర్యం అందించి, తల్లిలా గర్భం ధరించి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతోంది. అవును మీరు విన్నది నిజమే.. గోద్రాకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్ ఈ ప్రతి సృష్టికి పూనుకుంటోంది. దీనికోసం పురుషుడిగా తన వీర్యాన్ని తీసి క్రయోజెనిక్ పద్ధతిలో సోమవారం నిల్వ చేసింది.
             
గోద్రాలోని చిన్న గ్రామం పంచమహల్‌లో జెస్నూర్ డయారా జన్మించింది. పుట్టినప్పుడు పురుష అంగాలతో జన్మించింది. కానీ వయసు వచ్చే కొద్దీ తనలో స్త్రీ లక్షణాలు పెరుగుతుండడంతో తానో ట్రాన్స్‌జెండర్ అని తెలిసొచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 25ఏళ్లు. ఇటీవలే రష్యన్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఇదంతా ఓ ఎత్తయితే ఇప్పుడు డయారా పూర్తిగా స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అయితే స్త్రీగా మారిన తరువాత తాను తల్లిని కావాలని అనుకుంటోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. తాను స్త్రీగా మారిన తరువాత జన్మనివ్వబోయే బిడ్డకు తండ్రి కూడా తానే కావాలని డయారా కోరిక. దీనికోసమే తన వీర్యాన్ని ఆనంద్ ప్రాంతం‌లోని ఓ ఫెర్టిలిటీ కేంద్రంలో గడ్డకట్టించి భద్రపరిచింది.

స్త్రీగా మారిన తరువాత ఆ వీర్యాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చి, దాని ద్వారా బిడ్డను కనాలని డయారా భావిస్తోంది. త్వరలో సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత, ఈ వీర్యంతో ఆమె తల్లి కానుంది. ఒకవేళ అదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక భారతీయ వ్యక్తిగా డయారా రికార్డు సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే డయారా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసిన డయారా గుజరాత్‌ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.





హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>