PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-ap09cc6164-5961-40c6-b2d2-ab9d685acbf3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-ap09cc6164-5961-40c6-b2d2-ab9d685acbf3-415x250-IndiaHerald.jpgకరోనా.. ఈ పదం వింటే చాలు జనం మొన్నటి వరకూ వణికిపోయేవారు. ఎంతగా అంటే.. కరోనాతో మరణించిన వారి బంధువులు కూడా ఆ శవాల వైపు చూడలేదు కొన్నాళ్లు. కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులను కనీసం దగ్గరకు వచ్చి పరామర్శించ లేదు. కరోనా రోగుల శవాలకు సరిగ్గా అంత్యక్రియలు కూడా జరిగేవి కావు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా పట్ల అంత భయం అవసరం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీలో కరోనా పరిస్థితి చాలావరకూ అదుపులోకి వచ్చేసింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా కేవలం 30 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాcorona-ap;odisha;central government;vఆంధ్రావాసులకు ఇదిగో గుడ్‌ న్యూస్.. ఇక భయం లేదు...!?ఆంధ్రావాసులకు ఇదిగో గుడ్‌ న్యూస్.. ఇక భయం లేదు...!?corona-ap;odisha;central government;vTue, 16 Feb 2021 10:00:00 GMT
కరోనా పట్ల అంత భయం అవసరం లేదనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ఏపీలో కరోనా పరిస్థితి చాలావరకూ అదుపులోకి వచ్చేసింది. నిన్న రాష్ట్రంలో కొత్తగా కేవలం 30 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8,88,899కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 7,163 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు.

నిన్న రాష్ట్రంలో 19 వేల కరోనా పరీక్షలు నిర్వహించినా కేవలం 30 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల కాలంలో ఇదే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. వ్యాప్తిని కట్టడిచేసే నిబంధనలు పాటిస్తుండటం, వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా 188 జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.


అంతే కాదు.. గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ పేర్కొంది. అసోం, రాజస్థాన్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, లక్షద్వీప్‌, మేఘాలయ, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లద్దాఖ్‌, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, డయ్యూ డామన్‌ - దాద్రానగర్‌ హవేవీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదు.
 


100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>