PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder541ba836-d03b-41a4-821b-1ed507b18128-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder541ba836-d03b-41a4-821b-1ed507b18128-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. పరువు కోసం కన్నపిల్లలను సైతం చంపేసుకుంటున్నారు. ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా హత్య చేశారు. వేరే మతం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఆమె బతికుండానే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. murder;ajith kumar;prema;varun;varun sandesh;varun tej;huzur nagar;police;village;love;petrol;february;police station;arrest;murder.;traffic police;local language;father;ajit pawarదారుణం: యువతిని సజీవ దహనంచేసిన కుటుంబ సభ్యులు.. ఎందుకంటే..!?దారుణం: యువతిని సజీవ దహనంచేసిన కుటుంబ సభ్యులు.. ఎందుకంటే..!?murder;ajith kumar;prema;varun;varun sandesh;varun tej;huzur nagar;police;village;love;petrol;february;police station;arrest;murder.;traffic police;local language;father;ajit pawarTue, 16 Feb 2021 07:00:00 GMTహత్య చేశారు. వేరే మతం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఆమె బతికుండానే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

యువతిని చంపించేందుకు ఆమె కుటుంబ సభ్యులు రూ.1.5 లక్షలు చెల్లించి వరుణ్ తివారీ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఇది పరువు హత్యేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంత్ కబీర్ నగర్ ఎస్పీ కౌస్తుబ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేదీన ధాన్‌ఘంట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిగినా గ్రామంలో సగం కాలిన యువతి శరీరాన్ని గుర్తించడం జరిగింది.

ఇక దీనిపై దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ కూడా రంగంలోకి దింపారు. ఆ మృతదేహాన్ని గోరఖ్‌పూర్‌లోని బెల్ఘాట్ ప్రాంతానికి చెందిన రంజనగా గుర్తించాం. బాధితురాలి మృతికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. తన కూతురు ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపారు. ఆమె ముస్లిం వ్యక్తితో ప్రేమ బంధాన్ని విడిచి పెట్టడానికి సిద్ధంగా లేదని అతడు చెప్పాడు. దీంతో అతడు తన కొడుకు, అల్లుడుతో కలిసి ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఇందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.

ఇక నిందితుల్లో ఒకరు ఫిబ్రవరి 3వ తేదీన రంజనాను బైక్‌పై జిగినా గ్రామ సమీపంలో ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ఆమె చేతులు, కాళ్లు కట్టివేశాడని చెప్పారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి తండ్రి కైలాష్ యాదవ్, సోదరుడు అజిత్ యాదవ్, బావ సత్యప్రకాశ్ యాదవ్, మరో వ్యక్తి సీతారామ్ యాదవ్‌లను అరెస్ట్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ హత్యకు ఉపయోగించిన బైక్‌ను, పెట్రోల్ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


కేసీఆర్ కోసం 600 ఏళ్ల త‌ర్వాత గొప్ప యాగం... జ‌న్మ‌దినం రోజున నిర్వ‌హ‌ణ‌..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గడ్డ‌కు షాకిచ్చిన హై కోర్టు

వైసీపీ ఎమ్మెల్యే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ పాలి " ట్రిక్స్ " ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>