PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/hot-topic-on-greater-mayor-vijayalakshmi-cast-behind-intercast-marriage31ac5b52-63b3-4eed-80ca-73b0c9d85ea7-415x250-IndiaHerald.jpgకొత్తగా హైదరాబాద్ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ప్ర‌మేయంతోనే షేక్‌పేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి బ‌దిలీ జ‌రిగింద‌న్న చ‌ర్చ ఇప్పుడు హైద‌రాబాద్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ముందు మాములుగా తీసుకున్నా.. విజ‌య‌ల‌క్ష్మీ కావాల‌నే చేయించిన‌ట్లుగా స్ప‌ష్టమ‌వుతోంద‌ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆందోళ‌న‌కు దిగేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఫిబ్రవరి 11 న హైదరాబాద్ కొత్త మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి బాధ్యతలు స్వీకరించిన 72 గంటల్లోనే షేక్‌పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డికిmayor;kcr;lakshmi;srinivas;vijayalakshmi;hyderabad;korcha;police;february;reddyషేక్‌పేట ఎమ్మార్వో బ‌దిలీతో మేయ‌ర్‌పై ఉద్యోగ సంఘాల‌ గ‌ర్రు గుర్రు.. ఏం జ‌రుగుతోందంటే...షేక్‌పేట ఎమ్మార్వో బ‌దిలీతో మేయ‌ర్‌పై ఉద్యోగ సంఘాల‌ గ‌ర్రు గుర్రు.. ఏం జ‌రుగుతోందంటే...mayor;kcr;lakshmi;srinivas;vijayalakshmi;hyderabad;korcha;police;february;reddyTue, 16 Feb 2021 08:07:23 GMTహైదరాబాద్ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ప్ర‌మేయంతోనే షేక్‌పేట ఎమ్మార్వో  శ్రీనివాస్ రెడ్డి  బ‌దిలీ జ‌రిగింద‌న్న చ‌ర్చ ఇప్పుడు హైద‌రాబాద్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  అయితే ముందు మాములుగా తీసుకున్నా.. విజ‌య‌ల‌క్ష్మీ కావాల‌నే చేయించిన‌ట్లుగా స్ప‌ష్టమ‌వుతోంద‌ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆందోళ‌న‌కు దిగేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఫిబ్రవరి 11 న హైదరాబాద్ కొత్త మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి బాధ్యతలు స్వీకరించిన 72 గంటల్లోనే షేక్‌పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డికి బదిలీ ఉత్తర్వులు రావ‌డంపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మేయర్ ఉద్దేశ పూర్వకంగా చేయించింది అన్న ప్రచారం జరగడంతో వివాదం ముందురుతోంది.


మేయర్ పదవిలోకి వచ్చిన మరుసటి రోజే, అంతకు ముందు ఆమెతో గొడవ పడిన తహసీల్దార్ బదిలీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బదిలీ చేయించగలిగారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులంతా బదిలీని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీఆర్వోలు మాత్రం తమ గొంతు కోస్తుంటే వీరంతా చూస్తూ కూర్చున్నారని, ఇప్పుడేమో ఒక్కరిపై బదిలీ వేటు వేయగానే సీఎం కేసీఆర్ ను సైతం కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జీ హుజూర్ అంటూ ప్రజాప్రతినిధుల దగ్గర ఉండే అధికారులకే పోస్టింగులు ఉంటాయని, లేదంటే బదిలీ వేటు తప్పదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు నుంచే వాస్త‌వానికి విజ‌య‌ల‌క్ష్మికి, ఎమ్మార్వోకు మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. కొన్ని రోజుల క్రితం తనను విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మార్వో, నాటి కార్పోరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి మీద బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత విజ‌య‌ల‌క్ష్మి ఈ ఆరోపణను ఖండిస్తూ కౌంటర్ ఎమ్మార్వో మీద ఫిర్యాదు చేశారు. ఈ నెల 11 న మేయ‌ర్ గా ఎన్నికైన కొద్ది గంట‌ల్లోనే విజ‌య‌ల‌క్ష్మీ.. శ్రీనివాస్ రెడ్డి ని షేక్‌పేట నుంచి ట్రాన్స‌ఫ‌ర్ చేయించ‌డంతో రెవిన్యూ డిపార్ట్ మెంట్, ఉద్యోగ సంఘాలు మండిప‌డుతున్నాయి . వారంతా ఎమ్మార్వో కే అండ‌గా నిల‌బ‌డుతున్నారు.


వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>