SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news40099382-c463-488c-8f8a-65d3254b30ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news40099382-c463-488c-8f8a-65d3254b30ed-415x250-IndiaHerald.jpgపర్యాటక ఇంగ్లండ్ జట్టు‌తో చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరిగిన రెండవ టెస్ట్ లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టుపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ 279 పరుగుల తేడాతో గెలిస్తే..ప్రతికరంగా టీమిండియా 317 పరుగుల తేడాతో గెలిచి దెబ్బకు దెబ్బ తీసింది. టీమిండియా నిర్దేశించిన 482 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ చేధించలేక చేతులెత్తేసింది.రూట్ సేన ను మొదటి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు రెండవ ఇన్నింగ్స్ లో అదే జోరు కొనసాగిస్తూ 164 పరుగుsports news;ms dhoni;apoorva;virat kohli;england;king;chennai;army;king 1;letter;chepauk;paruguకోహ్లీ రికార్డుల మోత..ధోని రికార్డ్ సమం ..!!కోహ్లీ రికార్డుల మోత..ధోని రికార్డ్ సమం ..!!sports news;ms dhoni;apoorva;virat kohli;england;king;chennai;army;king 1;letter;chepauk;paruguTue, 16 Feb 2021 17:34:51 GMTపర్యాటక ఇంగ్లండ్ జట్టు‌తో చెన్నై లోని చెపాక్ స్టేడియం లో జరిగిన రెండవ టెస్ట్ లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టుపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ 279 పరుగుల తేడాతో గెలిస్తే..ప్రతికరంగా టీమిండియా 317 పరుగుల తేడాతో గెలిచి దెబ్బకు దెబ్బ తీసింది. టీమిండియా నిర్దేశించిన 482 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ చేధించలేక చేతులెత్తేసింది.రూట్ సేన ను మొదటి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు రెండవ ఇన్నింగ్స్ లో అదే జోరు కొనసాగిస్తూ  164 పరుగులకే కుప్పకూల్చి ఘనమైన గెలుపును అందుకుంది. ఇది టీమిండియా టెస్టు చరిత్రలో ఐదో పెద్ద విజయంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం.

ఈ  అపూర్వ విజయంతో టీమిండియాకెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో పలు చేరాయి. భారత జట్టు ఇప్పటివరకూ మూడొందలు అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచిన విజయాల సంఖ్య ఆరు ఉండగా..  పరుగుల పరంగా ఈ ఆరు అతిపెద్ద విజయాల్లో ఐదు విజయాలు కోహ్లీ కెప్టెన్సీ లో గెలిచినవే కావడం విశేషం.. ఇక్కడ కేవలం ఒక్కటి మాత్రమే ధోని ఖాతాలో ఉంది. 2008-09 సీజన్‌లో మొహాలీలో ఆసీస్‌తో టెస్ట్ మ్యాచ్ మాత్రమే ధోని కెప్టెన్సీ లో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 320 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాప్‌-6 మిగిలిన  ఐదు భారీ విజయాలు కోహ్లి కెప్టెన్సీలోనే వచ్చాయి.

 2015-16 సీజన్‌లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 337 పరుగులు, 2016-17 సీజన్‌లో ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 321 పరుగులు, 2019లో నార్త్‌ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 318 పరుగులు, 2017లో శ్రీలంకతో గాలేలో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగులు, తాజాగా ఇంగ్లండ్‌తో 317 పరుగుల తేడాతో సాధించిన విజయాలు కోహ్లీ కెప్టెన్సీ లోనే నమోదు అయ్యాయి. మరొకవైపు భారత్‌లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ల జాబితాలో ఎంఎస్‌ ధోని సరసన కోహ్లి నిలిచాడు. ఇంగ్లండ్‌పై తాజా విజయంతో భారత్‌లో కెప్టెన్‌గా కోహ్లి సాధించిన విజయాల సంఖ్య 21కు చేరింది. అంతకుముందు ధోని నేతృత్వంలోని టీమిండియా కూడా భారత్‌లో 21 టెస్టు విజయాలనే నమోదు చేసింది. దాంతో ధోని రికార్డును సమం చేశాడు కింగ్  కోహ్లి.


ఏమ‌న్నా అర్థ‌మ‌వుతోందా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>