PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబులా తమకు డ్రామాలాడటం రాదన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, మరి చంద్రబాబు ఇంత వరకు ఎందుకు రాయలేదని విజయసాయి ప్రశ్నించారు.vizag steel;cbn;prema;visakhapatnam;jagan;andhra pradesh;narendra modi;mohandas karamchand gandhi;y. s. rajasekhara reddy;congress;mp;telugu;vishakapatnam;prime minister;chief minister;parliment;love;letter;tdp;central government;96;ycp;reddy;yatra;maha;party;narendraవైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం జగన్ లేఖ వ్రాశారు... మరి బాబు సంగతి ఏంటి ?వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం జగన్ లేఖ వ్రాశారు... మరి బాబు సంగతి ఏంటి ?vizag steel;cbn;prema;visakhapatnam;jagan;andhra pradesh;narendra modi;mohandas karamchand gandhi;y. s. rajasekhara reddy;congress;mp;telugu;vishakapatnam;prime minister;chief minister;parliment;love;letter;tdp;central government;96;ycp;reddy;yatra;maha;party;narendraTue, 16 Feb 2021 23:10:00 GMTవైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలోని మోదీ సర్కారును ఢీకొట్టేందుకు సిద్ధం అయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 20న మహా పాదయాత్ర చేయబోతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్లమెంట్ లోపల, వెలుపల పోరాడుతూనే ఉన్నామని వెల్లడించారు. ఈ విషయంలో వైసీపీ చాలా క్లారిటీతో ఉందన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో విజయసాయి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబునాయుడు 56 కంపెనీలను ప్రైవేటీకరించాలని చూస్తే ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు.



ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ పోరాటం చేస్తుందని విజయసాయి ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీ కింద మారిస్తే ఆరు నెలల్లో లాభాల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వైసీపీ బలంగా నమ్ముతుండగా.. కేంద్రం మాత్రం వినడం లేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13 కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అతి త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కార్మిక సంఘాలను కలిపిస్తామని తెలిపారు. అలాగే అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని విజయసాయి వివరించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.



విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు కాపాడేందుకు ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’ చేయపడతామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన గెట్ వరకు, అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ మొత్తం 23 కిలో మీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 8:30 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు ఈ పాదయాత్ర ఉంటుందని.. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు దెబ్బ ఢిల్లీకి వినిపించేలా పాదయాత్ర చేపడతామని వెల్లడించారు. తాము చేపట్టే పాదయాత్రకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని విజయసాయి స్పష్టం చేశారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబులా తమకు డ్రామాలాడటం రాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తుస్తోందని వెల్లడించారు. తాము పిలిచిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తప్ప, మిగిలిన అందరూ వచ్చారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి బీజేపీతో చంద్రబాబు ప్రేమ కలాపాలు సాగించేలా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, మరి చంద్రబాబు ఇంత వరకు ఎందుకు రాయలేదని విజయసాయి ప్రశ్నించారు.




పాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>