SpiritualityChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/life-skills877cd674-e5f2-447d-8100-af1dfb3863b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/life-skills877cd674-e5f2-447d-8100-af1dfb3863b7-415x250-IndiaHerald.jpgపుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది. అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదlife-skills;bhavana;jeevitha rajaseskhar;nithya newతొందరపడితే.. చేతివరకూ వచ్చిన ఛాన్స్‌ చేజారుతుంది.. జాగ్రత్త..తొందరపడితే.. చేతివరకూ వచ్చిన ఛాన్స్‌ చేజారుతుంది.. జాగ్రత్త..life-skills;bhavana;jeevitha rajaseskhar;nithya newTue, 16 Feb 2021 07:00:00 GMT

జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు. పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళబుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి.


జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు. ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసూ బలహీనపడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ- కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది.

విసుగు తెప్పించింది. కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాత రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం.




కేసీఆర్ కోసం 600 ఏళ్ల త‌ర్వాత గొప్ప యాగం... జ‌న్మ‌దినం రోజున నిర్వ‌హ‌ణ‌..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గడ్డ‌కు షాకిచ్చిన హై కోర్టు

వైసీపీ ఎమ్మెల్యే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ పాలి " ట్రిక్స్ " ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>