PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-municipal-polls-candidates-facing-tensiona085cd01-cde3-41d5-adb4-84a9bab5d474-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-municipal-polls-candidates-facing-tensiona085cd01-cde3-41d5-adb4-84a9bab5d474-415x250-IndiaHerald.jpgఆగిపోయిన దగ్గరనుంచే పురపాలక సంస్థల ఎన్నికలు మొదలవుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో వైసీపీలో సంతోషం మొదలైంది, అదే సమయంలో టీడీపీ ఈ విషయంపై ఆందోళనలో ఉంది. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. అభ్యర్థులు మాత్రం కంగారు పడుతున్నారు. గతంలో నామినేషన్లు వేసినవారంతా కొత్తగా ప్రచార పర్వం ప్రారంభించబోతున్నారు. ap municipal polls;tdp;partyపురపోరు: అభ్యర్థుల్లో దడ..పురపోరు: అభ్యర్థుల్లో దడ..ap municipal polls;tdp;partyTue, 16 Feb 2021 08:00:00 GMTటీడీపీ ఈ విషయంపై ఆందోళనలో ఉంది. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. అభ్యర్థులు మాత్రం కంగారు పడుతున్నారు. గతంలో నామినేషన్లు వేసినవారంతా కొత్తగా ప్రచార పర్వం ప్రారంభించబోతున్నారు.

మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడి దాదాపుగా ఏడాది కావస్తోంది. అప్పటికి, ఇప్పటికి రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ప్రతిపక్షం నుంచి చాలామంది అధికార పార్టీవైపుకి వచ్చేశారు. వీరిలో కొంతమంది అప్పట్లో ప్రతిపక్ష పార్టీ తరపున నామినేషన్లు వేసినవారు కూడా ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు పార్టీ మారితే అసలు అభ్యర్థి ఎవరనే విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. బి-ఫామ్ వ్యవహారంలో కొత్త తలనొప్పులు వస్తాయని అధికార పార్టీ అభ్యర్థులు భయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ, తమ తరపు నామినేషన్లు వేసిన వారు పార్టీ మారడంతో.. కొత్త అభ్యర్థులకోసం వెదుక్కుంటోంది. స్వతంత్రులుగా నామినేషన్లు వేసినవారినుంచి కొంతమందిని తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్షం పావులు కదుపుతోంది.

అభ్యర్థులు చనిపోతే ఎన్నిక వాయిదా..
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసి, పరిశీలనలో ఆ నామినేషన్‌ సక్రమమే అని తేలి, ఆ తర్వాత అభ్యర్ధి మరణించిన పక్షంలో ఆ మున్సిపల్‌ వార్డుకి జరిగే ఎన్నిక వాయిదా వేసేందుకు ఆర్వోలకు ప్రత్యేక అధికారాలుంటాయి. దీనిపై ఎన్నికల కమిషన్, ఆర్వోల అధికారాలను మరోసారి స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.  అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద ప్రత్యేక ఎన్నికల గుర్తును పొందిన రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ అభర్థి మరణించినా ఎన్నిక వాయిదా వేయొచ్చని తెలిపింది. మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో జరిగిన  నామినేషన్‌ దాఖలు ప్రక్రియకు, తాజాగా ఇప్పటి ఎన్నికల ప్రక్రియకు మధ్య దాదాపుగా ఏడాది గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది సమయంలో కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించారు. దీంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడతాయని తేలింది. 


ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>