MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-season-5-final-contestents-names-reaveale1e82a62-0b7e-4644-a330-13990efe037e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-season-5-final-contestents-names-reaveale1e82a62-0b7e-4644-a330-13990efe037e-415x250-IndiaHerald.jpgకనీవినీ ఎరుగని రీతిలో మన సౌత్ ఇండియా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే షో బిగ్ బాస్. ఇటీవల బిగ్ బాస్ ఫోర్ సీజన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ చేసుకుంది. బుల్లితెరపై ఏ షో సాధించలేని టిఆర్పి రేటింగ్ ను ఈ షో తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ తోపాటు మలయాళం భాషలలో ఎన్నో సంవత్సరాల నుండి మొత్తం 4 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ,మరో సరికొత్త కంటెస్టెంట్ లతో మన ముందుకు వచ్చే,ఈ బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మొత్తం 16 మంది ఇంటి సభ్యులతో, బిగ్ బాbigg boss season 5 final contestents names reaveal;mahesh;ntr;nani;nagarjuna akkineni;salman khan;deepika;nageshwara rao akkineni;ravi anchor;tara;yajamanya;audi;india;korea, south;adinarayanareddy;tollywood;telugu;bigboss;rajani kanth;tamil;kannada;hero;reality show;star maa;nandamuri taraka rama rao;house;manamబిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా..బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా..bigg boss season 5 final contestents names reaveal;mahesh;ntr;nani;nagarjuna akkineni;salman khan;deepika;nageshwara rao akkineni;ravi anchor;tara;yajamanya;audi;india;korea, south;adinarayanareddy;tollywood;telugu;bigboss;rajani kanth;tamil;kannada;hero;reality show;star maa;nandamuri taraka rama rao;house;manamTue, 16 Feb 2021 15:00:00 GMT సౌత్ ఇండియా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే షో బిగ్ బాస్. ఇటీవల బిగ్ బాస్ ఫోర్ సీజన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా కంప్లీట్ చేసుకుంది. బుల్లితెరపై ఏ షో సాధించలేని టిఆర్పి రేటింగ్ ను ఈ షో తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ తోపాటు మలయాళం భాషలలో ఎన్నో సంవత్సరాల నుండి  మొత్తం 4 సీజన్లను విజయవంతంగా  పూర్తి చేసుకుంటూ,మరో సరికొత్త కంటెస్టెంట్ లతో మన ముందుకు వచ్చే,ఈ బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. మొత్తం 16 మంది ఇంటి సభ్యులతో, బిగ్ బాస్ వారిని ఆడించే ఆటలతో, ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాస్తవానికి బిగ్ బాస్ షో హిందీలో సల్మాన్ ఖాన్ తో తొలి ప్రయత్నంగా ప్రారంభించారు. అక్కడ ఈ షో ని ప్రేక్షకులు బాగా ఆదరించడంతో, ఇక అన్ని భాషలలోనూ ఈ ప్రముఖ హీరో ని వ్యాఖ్యాతగా పెట్టుకొని,మొత్తం 16 మంది సెలబ్రిటీస్ తో 100 రోజులపాటు ఈ రియాల్టీ షో నిర్వహించారు. ఇక మన తెలుగులో కూడా, ఈ రియాల్టీ షో ఘన విజయం సాధించి,నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని,ఇప్పుడు ఐదవ సీజన్ లో కి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ ఐదవ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా ఉండబోతున్నారు అనే విషయంపై ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ టీం, ఆ కంటెస్టెంట్స్ పేర్లను   విడుదల చేసింది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో మొత్తం 16 మంది హౌస్ మేట్స్ లో, బిగ్ బాస్ ఇప్పటికే కొంతమంది ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వారిలో హైపర్ ఆది,  యాంకర్ రవి, షణ్ముఖ్, యాంకర్ వర్షిని, ప్రముఖ టిక్ టాక్ సెలబ్రిటీ దీపిక పిల్లి పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ ఫోర్ కి వ్యాఖ్యాతగా నటించిన నాగార్జున పేరు,బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి కూడా కొనసాగిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ వార్తలు తారుమారయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సెలబ్రిటీస్ తో బిగ్ బాస్ షో ని  ప్లాన్ చేసినట్లు సమాచారం. సీజన్ వన్ కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని, సీజన్ త్రీ తో పాటు ఫోర్ కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ముందుగా ఆగస్టు 29వ తేదీన అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఈ బిగ్ బాస్ షో ని ప్రసారం చేయబోతున్నట్లు గా  బిగ్ బాస్ టీం వెల్లడి చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి వ్యాఖ్యాతగా,సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం మహేష్ బాబు తో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ఇంత భారీ హంగులతో మన ముందుకు రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే..




ఒక అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నా.. మే నెలలో పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>