PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-house-damageda162303d-56e1-4b00-9d23-c7d10153a586-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-house-damageda162303d-56e1-4b00-9d23-c7d10153a586-415x250-IndiaHerald.jpg రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేశ్ బిల్డర్.. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేశ్ కుటుంబం నివసిస్తోంది. అయితే సోమవారం రమేష్ ఇంటి ముందు నిర్మింటిన పది మెట్లను స్థానిక అధికారులు కూల్చేశారుguntur house damaged;panchayati;mandalam;tdp;local language;narasaraopet;ycp;pettaటీడీపీకి ఓటేస్తే అంతేనా!టీడీపీకి ఓటేస్తే అంతేనా!guntur house damaged;panchayati;mandalam;tdp;local language;narasaraopet;ycp;pettaTue, 16 Feb 2021 08:53:40 GMTపంచాయతీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. రాష్ట్రంలోని మిగితా ప్రాంతాల కంటే గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య గట్టి పోటీ జరుగుతోంది. అయితే అధికార పా\ర్టీ బెదిరింపులకు దిగుతుందని, అధికారులతో కలిసి టీడీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

   రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేశ్ బిల్డర్.. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేశ్ కుటుంబం నివసిస్తోంది. అయితే  సోమవారం రమేష్ ఇంటి ముందు నిర్మింటిన పది మెట్లను స్థానిక అధికారులు కూల్చేశారు. అనుమతి లేకుండా నిర్మించారని చెబుతూ.. ఈ పని కానిచ్చేశారు.  అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్న కారణంతోనే తన ఇంటి మెట్లను కూల్చేశారని రమేష్ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని తమపై ఒత్తిడి చేశారని, వేయకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

        గోగులపాడు సర్పంచ్ ఎన్నికల్లో రమేశ్ బంధువులు టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేశారని తెలిసి తనపై గ్రామ పెద్దలు కక్ష కట్టారని, ప్రజా ప్రతినిధితో ఒత్తిడి తెచ్చి తాను నిర్మించిన ఇళ్ల మెట్లను కూల్చివేశారని రమేశ్ ఆరోపించారు. కూల్చివేత సమయంలో తాను ఇంట్లో లేనని, తన అత్తమామలు జేసీబీకి అడ్డంపడినా ప్రయోజనం లేకపోయిందని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.తాను నిర్మించిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇంటి ముందు మెట్లు, ర్యాంపులను కూల్చివేశారన్నారు. విషయం తెలిసి ఇంటికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తే.. ఓ  ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పారని రమేశ్ వాపోయారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.




కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>