PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayor-losts-her-image-with-foolish-words3c4e4691-98b2-461f-a964-e041237e6c66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mayor-losts-her-image-with-foolish-words3c4e4691-98b2-461f-a964-e041237e6c66-415x250-IndiaHerald.jpgఅసలు జరిగిందేమంటే, 2020వ సంవత్సరం చివర్లో కురిసిన భారీ వర్షాల దెబ్బకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని, గడిచిన 100 ఏళ్ల లోనె ఇంత అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని వర్షాల దెబ్బకు వేల కొద్దీ ఇళ్లు నేలమట్టమై, మరి కొన్ని ఇళ్లు వారాల పాటు నీట మునగడం, కొట్టు కొచ్చిన మట్టి మేటలు వేయటం జరిగింది. జీహెచ్ఎంసీ పాలక మండలి, తెలంగాణ ప్రభుత్వంపై నగర బాధితులు దుమ్మెత్తి పోయడం, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో “టీఆర్ఎస్ పార్టీ” దారుణంగా నష్టపోయింది.mayor losts her image with foolish words;deva;pratishta;vijayalakshmi;hyderabad;telangana rashtra samithi trs;telangana;government;media;television;interview;doctor;petta;partyకొత్త మేయర్ ప్రతిష్ట మురికి మూసీపాలేనా? జొక్కర్ని తలపించే తింగిరి మాటలు?కొత్త మేయర్ ప్రతిష్ట మురికి మూసీపాలేనా? జొక్కర్ని తలపించే తింగిరి మాటలు?mayor losts her image with foolish words;deva;pratishta;vijayalakshmi;hyderabad;telangana rashtra samithi trs;telangana;government;media;television;interview;doctor;petta;partyTue, 16 Feb 2021 22:00:00 GMTడాక్టర్ కంచర్ల కేశవరావు (కేకే) తనయ గద్వాల విజయలక్ష్మి చారిత్రాత్మక హైదరాబాదు నగర ప్రథమ పౌరురాలిగా పదవి చేపడుతూనే తప్పుచేసిన తన సొంత అనుచరులను శిక్షించి జనం మెప్పు పొందారు


ఆమె సాధించుకున్న గౌరవం అంతా ఒక్క అనాలోచిత, అవగాహనారహిత మాటతో మట్టిపాల్జేసుకున్నారు. అయితే, ఆమె తనమాటను కొందరు కావాలని వక్రీకరించారని నగరం ఈ ఐదేళ్ల తన పాలనాకాలంలో అభివృద్ధి పథంలో నడిచి కీర్తిప్రతిష్టలు పొందాలనేదే తన అభిమతమని ఆమె క్లారిటీ ఇచ్చారు.


అసలు జరిగిందేమంటే,  2020వ సంవత్సరం చివర్లో కురిసిన భారీ వర్షాల దెబ్బకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని, గడిచిన 100 ఏళ్ల లోనె ఇంత అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని వర్షాల దెబ్బకు వేల కొద్దీ ఇళ్లు నేలమట్టమై, మరి కొన్ని ఇళ్లు వారాల పాటు నీట మునగడం, కొట్టు కొచ్చిన మట్టి మేటలు వేయటం జరిగింది. జీహెచ్ఎంసీ పాలక మండలి, తెలంగాణ ప్రభుత్వంపై నగర బాధితులు దుమ్మెత్తి పోయడం, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో “టీఆర్ఎస్ పార్టీ” దారుణంగా నష్టపోయింది.


నగరానికి మేయర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మి, నాటి విపత్తును జ్ఞప్తికి తెచ్చుకొంటూ అనూహ్య అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలను ఎడిట్ చేసి, ఇదేనా మీ “టీఆర్ఎస్ మేయర్ బాధ్యత” అంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు.


దీంతో చివరికి మేయర్ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. “ఐదేళ్లూ వానలు కురవొద్దు” నూతన ప్రథమ పౌరురాల్ని ఇంటర్వ్యూ చేస్తోన్న క్రమంలో - ప్రముఖ ఛానెల్ కు చెందిన రిపోర్టర్, గతేడాది వరదల విలయాన్ని గుర్తు చేస్తూ, మరోసారి నగరంలో భారీ వర్షాలు కురిస్తే ఆపదలు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి భరోసానిస్తారు? అని ప్రశ్నించాడు.


ఆ ప్రశ్నకు మేయర్ విజయలక్ష్మి బదులిస్తూ, ‘‘ఫస్ట్‌ థింగ్‌ నేను దేవుణ్ని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని'' అని చెప్పారు. అంతేకాదు, సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నా ప్రజలు కూడా తమవంతుగా సహకారం అందించాలని అన్నారు



నాలాల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయన్నది ఆమె స్పష్టం చేసారు. అయినప్పటికీ, ఇప్పుడు తాను అక్రమ ఇళ్లను కూల్చలేనని, ముందస్తు గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వరదల విపత్తును నిర్వహించలేమని మేయర్ అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ ‌లో ఈ ఐదేళ్లు వర్షాలు పడకూడదని భగవంతుడిని కోరుకుంటానంటూ కొత్త మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.


అసలు వర్షాలు పడకూడదని కోరుకోవడమేంటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ప్రజల బాధ్యత దేవుడిదేనంటూ సెటైర్లు పేలుస్తున్నారు. వెతికి వెతికి జోకర్‌ ని తెచ్చి మేయర్‌ని చేశారంటూ కొందరు ఘాటు కామెంట్లు పెడుతున్నారు.


తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో మేయర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. వానలు కురవొద్దని తాను కోరలేదని, ఈ ఐదేళ్లూ వరదలు రావొద్దన్నదే తన అభిమతమని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు, ట్రోలర్స్‌పై మేయర్ గరం గరం ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తాను చెప్పిన ఒక మాటను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ మేయర్ విజయలక్ష్మి మండిపడ్డారు.


అంతులేకుండా సాగుతోన్న ట్రోలింగ్ కు అడ్డుకట్ట పడేలా మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. నగరంలో గత వందేళ్లలో రానంత ఎక్కువగా ఈసారి వర్షాలు పడ్డాయని, దాంతో నగరంలో వరదలు వచ్చాయని గుర్తుచేస్తూ, రాబోయే రోజుల్లో అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటానని చెప్పానని, కానీ కొంత మంది తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారని మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


పనిలో పనిగా షేక్‌పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారం పైనా ఆమె క్లారిటీ ఇచ్చేశారు. గతంలో విజయలక్ష్మి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో షేక్ పేట తహసీల్దారు తో గొడవ పడటం ఇప్పుడామె మేయర్ అవుతూనే ఆ అధికారిపై బదిలీ వేటు వెయటం బాగా చర్చనీయమైంది. అయితే, అది సాధారణ బదిలీ కావొచ్చని, దాంతో తనకే మాత్రం సంబంధం లేదని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అయితే మేయర్ విజయలక్ష్మి పగదీర్చుకుందనేది ప్రజల మాట నెటిజెన్ల ట్రోలింగ్.





తాప్సి అలా ముద్దుపెట్టేస్తుందేంటి.. రొమాన్స్ లో మునిగిపోయింది...?

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>