Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/godra-massacredc4443e7-3b70-4304-b105-bbdacafba416-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/godra-massacredc4443e7-3b70-4304-b105-bbdacafba416-415x250-IndiaHerald.jpg సరిగ్గా 19 ఏళ్లు.. గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన మారణకాండ జరిగి. ఇన్నేళ్ల తరువాత ఆ ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సుమారు 19 ఏళ్ల క్రితం కరసేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో..godra massacre;delhi;gujarat - gandhinagar;police;petrol;february;news19 ఏళ్ల తరువాత ఎట్టకేలకు.. గోద్రా ఘటన ప్రధాన నిందితుడి అరెస్టు19 ఏళ్ల తరువాత ఎట్టకేలకు.. గోద్రా ఘటన ప్రధాన నిందితుడి అరెస్టుgodra massacre;delhi;gujarat - gandhinagar;police;petrol;february;newsTue, 16 Feb 2021 12:16:27 GMTగాంధీనగర్: సరిగ్గా 19 ఏళ్లు.. గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన మారణకాండ జరిగి. ఇన్నేళ్ల తరువాత ఆ ఘటనలో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సుమారు 19 ఏళ్ల క్రితం కరసేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులకు అరెస్టు చేశారు. గోద్రాలో ఉంటున్న రఫీక్ హుస్సేన్‌ను సోమవారం గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంచ్‌మహల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 19 ఏళ్ల క్రితం గోద్రా ఘటనకు కుట్రపన్నిన కోర్ గ్రూప్‌లో రఫీక్ హుస్సేన్ కీలక నిందితుడు. రఫీక్ హుస్సేన్ ఉన్న ప్రాంతానికి సంబంధించి లభించిన సమాచారంతో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ఇంటి వద్ద పోలీసులు మాటు వేశారు. ఈ క్రమంలోనే రఫీక్ హుస్సేన్‌ పోలీసుల చేతికి చిక్కాడు. గోద్రా ఘటన జరిగిన రోజున రైలు కంపార్ట్‌మెంట్ తగులబెట్టేందుకు రఫీక్ హుస్సేన్ పెట్రోల్ సిద్ధం చేశాడని, ఈ కుట్రలో రఫీక్ కీలకపాత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే రఫిక్‌పై అనేక కేసులున్నాయి.

ఇదిలా ఉంటే 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్‌లో కరసేవకులతో నిండిన రైలుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో మొత్తం 59 మంది కరసేవకులు మృతి చెందారు. కాగా ఆ సమయంలో రఫీక్ హుస్సేన్ ఒక కూలివానిగా అదే రైల్వే స్టేషన్‌లో పనిచేస్తుండేవాడు. రైలు రాగానే రఫీక్ దానిపై రాళ్లు విసిరి, పెట్రల్ చల్లాడు.

ఈ ఘటన తరువాత రఫీక్ హుస్సేన్ ఆ రైల్వే స్టేషన్ నుంచే కాకుండా, ఆ ప్రాంతం నుంచి కూడా పారిపోయి, ఢిల్లీ పరిసరాల్లో తలదాచుకుంటూ వచ్చాడు. ఇటీవలే మళ్లీ రఫిక్ గోద్రాకు తిరిగి వచ్చాడు. కుటుంబంతో సహా వచ్చి అక్కడే ఉంటున్నాడు. దీనిపై పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మాటువేసి మరీ రఫీక్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు.




స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>