PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijaya-lakshmi4b35dd44-e83a-4d83-a3f5-bcfd0bf0daaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vijaya-lakshmi4b35dd44-e83a-4d83-a3f5-bcfd0bf0daaa-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో జిహెచ్ఎంసి మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి గద్వాల్ వరుసగా వివాదాస్పద అంశాలలో చిక్కుకుంటున్నారు. ఆమె మేయర్ గా ఎన్నిక కాక ముందు షేక్పేట్ ఎమ్మార్వో తో ఒక విషయంలో గొడవ పడ్డారు. అప్పట్లో తన విధులకు ఆటంకం కలిగించారని సదరు ఎమ్మార్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తోంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న విజయలక్ష్మి తాను మేయర్ గా ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే సదరు ఎమ్మార్వో ని తన పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయించడం తెలంగాణ రాజకీsharmila;deva;varsha;vijayalakshmi;hyderabad;telangana;media;traffic policeవర్షాల పై హైదరాబాద్ మేయర్ కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు !వర్షాల పై హైదరాబాద్ మేయర్ కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు !sharmila;deva;varsha;vijayalakshmi;hyderabad;telangana;media;traffic policeTue, 16 Feb 2021 16:00:00 GMTఇటీవలి కాలంలో జిహెచ్ఎంసి మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి గద్వాల్ వరుసగా వివాదాస్పద అంశాలలో చిక్కుకుంటున్నారు. ఆమె మేయర్ గా ఎన్నిక కాక ముందు షేక్పేట్ ఎమ్మార్వో తో ఒక విషయంలో గొడవ పడ్డారు. అప్పట్లో తన విధులకు ఆటంకం కలిగించారని సదరు ఎమ్మార్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తోంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న విజయలక్ష్మి తాను మేయర్ గా ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే సదరు ఎమ్మార్వో ని తన పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయించడం తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ అంశం మీద నిన్నటి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను మీడియా ప్రశ్నించగా ఈ అంశం మీద తాను స్పందించడానికి సిద్ధంగా లేనని తప్పుకున్నారు. 

ఆ విషయం అలా ఉంచితే ఆమె నిన్న మరో మీడియా ఛానల్ తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. విషయం ఏమిటంటే విజయలక్ష్మి గద్వాల్ మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ఒక ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా సదరు యాంకర్ మాట్లాడుతూ గత ఏడాది కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది కదా ఈ నేపధ్యంలో మీరు మేయర్ గా ఎన్నికైన క్రమంలో ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని జనాలు నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి.

అదేమంటే వర్షాలు పడితే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏం చేస్తాను ? ప్రణాళికలు ఏ విధంగా సిద్ధం చేస్తాను అని చెప్పాల్సిన ఆమె వర్షాలు కురవ కూడదని దేవుడిని ప్రార్దిస్తానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే తాను మేయర్ ఉన్నన్నాళ్ళు వర్షాలు పడకపోతే తనకు ఎలాంటి చెడ్డపేరు రాదు, అంతే కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తాను ఎలాంటి ప్రయత్నం చేస్తాను అనే అంశాన్ని మాత్రం ఆమె చెప్పకపోవడంతో ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువగానే జరుగుతోంది. అవతలి వ్యక్తి ఎవరు ఏమిటి అని కూడా చూడకుండానే నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రోలింగ్ బారిన కొత్త మేయర్ కూడా పడ్డారు.   


బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>