PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-joinings4397ad3e-95e4-409a-9b40-5fd2cfb88ba7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-joinings4397ad3e-95e4-409a-9b40-5fd2cfb88ba7-415x250-IndiaHerald.jpgఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు... వైసీపీలో చేరుతున్నారు. సంగం మండలం చెర్లోవంగుల్లలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. ycp joinings;gautham new;gautham;raghu;thirtha;andhra pradesh;mp;district;kanna lakshminarayana;panchayati;mandalam;mla;minister;tdp;ycp;chief commissioner of elections;reddy;partyగెలిచిన గంటల్లోనే జంప్!గెలిచిన గంటల్లోనే జంప్!ycp joinings;gautham new;gautham;raghu;thirtha;andhra pradesh;mp;district;kanna lakshminarayana;panchayati;mandalam;mla;minister;tdp;ycp;chief commissioner of elections;reddy;partyTue, 16 Feb 2021 09:14:29 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ బరిలో కుటుంబ సభ్యుల మధ్యే పోరు జరుగుతోంది. ఇక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు.. కొన్ని గంటల్లోనే పార్టీ మార్చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తమ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు షాకిస్తూ.. గోడలు దూకేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.అధికార పార్టీ మెజార్టీ పంచాయతీలు గెలుచుకున్నా.. ఇతర పార్టీల వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

 ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు... వైసీపీలో చేరుతున్నారు. సంగం మండలం చెర్లోవంగుల్లలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. అలాగే ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆయన కూడా మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరారు. దీంతో వారి గెలుపునకు కృషి చేసిన టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి.

  మరోవైపు కర్నూల్ జిల్లా  రుద్రవరంలో పంచాయితీ సర్పంచ్‌గా గెలిచింది వైసీపీ మద్దతుదారులే అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. మాధవనగర్‌లోని తన నివాసంలో కోడుమూరు ఎమ్మెల్యే డా.జే.సుధాకర్‌తో కలిసి  ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన సొంతూరు రుద్రవరంలో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, అయినా టీడీపీ మద్దతుదారులు ఎన్నికైనట్లు చెప్పుకోవడం దుర్మార్గమని అన్నారు. తన సొంతూరిలో ఫ్యాక్షన్‌ లేకుడా ఏకగ్రీవం చేసేందుకే తాను గ్రామానికి వెళ్లానని తెలిపారు. సర్పంచ్‌గా ఎన్నికైన అభ్యర్థి గతంలో వైసీపీ తరపున జడ్పీటీసీగా ఎన్నికయ్యారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని వైసీపీ విజయాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. టీడీపీది ముగిసిన అధ్యాయమని అన్నారు. 


కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>