MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-nowd25336fb-3d07-42a0-ae03-db548eb6abaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-producing-5-films-nowd25336fb-3d07-42a0-ae03-db548eb6abaa-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అడ్వాన్స్ టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన సినిమాలను ఒక రేంజ్లో తెరకెక్కిస్తుంటాడు.అందుకే శంకర్ ని ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుస్తూ ఉంటారు.ఇక శంకర్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే ఆయన ఒక సినిమా మొదలుపెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కానీ శంకర్ మీద నమ్మకంతో నిర్dil-raju;technology;ram charan teja;dil raju;ram pothineni;shankar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;cameroon;cinema;king;director;indian;dil;james cameronశంకర్ కి దిల్ రాజు షరతులు వర్తిస్తాయా?శంకర్ కి దిల్ రాజు షరతులు వర్తిస్తాయా?dil-raju;technology;ram charan teja;dil raju;ram pothineni;shankar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;cameroon;cinema;king;director;indian;dil;james cameronTue, 16 Feb 2021 17:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అడ్వాన్స్ టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన సినిమాలను ఒక రేంజ్లో తెరకెక్కిస్తుంటాడు.అందుకే శంకర్ ని ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుస్తూ ఉంటారు.ఇక శంకర్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే ఆయన ఒక సినిమా మొదలుపెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కానీ శంకర్ మీద నమ్మకంతో నిర్మాతలు అతడికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో శంకర్ కి, నిర్మాతలకు మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి. 'రోబో2' సమయంలో లైకా సంస్థతో శంకర్ కి గొడవలు వచ్చాయి. ఇప్పుడు 'ఇండియన్ 2' సినిమా విషయంలో కూడా అవే గొడవలు రిపీట్ అవుతున్నాయట...



బడ్జెట్ పెరిగిపోవడం ఇప్పుడు 'ఇండియన్ 2' సినిమాను ఏకంగా పక్కన పెట్టేయడం జరిగింది..దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు శంకర్ తో కలిసి దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నాడు. నిజానికి 'ఇండియన్ 2' సినిమాకి దిల్ రాజు కూడా నిర్మాతగా వ్యవహరించాల్సి వుంది. కానీ ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ చేతులు మారింది. ఆ సమయంలో శంకర్ కి అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ తోనే దిల్ రాజుతో సినిమా చేయడానికి శంకర్ అంగీకరించాడు. రామ్ చరణ్ హీరోగా సినిమా చెయ్యడానికి ఇప్పుడు సిద్ధంగా వున్నారు..అయితే సినిమా మేకింగ్ విషయంలో దిల్ రాజు స్టైల్ వేరు.. శంకర్ స్టైల్ వేరు. దిల్ రాజు తన ప్రాజెక్ట్ లన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం జరిగేలా చూసుకుంటాడు.



డైరెక్టర్ లకి తన షరతులతో చుక్కలు చూపిస్తాడు.కానీ శంకర్ అలా కాదు. ఆయన సినిమా ఓ పట్టాన పూర్తవదు. మరి శంకర్ ని దిల్ రాజు కంట్రోల్ చేయగలడా..? దిల్ రాజు షరతులు శంకర్ కి వర్తిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దిల్ రాజు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడని.. సినిమాని ఇంతలోనే పూర్తి చేయాలి.. ఈ టైమ్ కి పూర్తి చేయాలనే నిబంధనలతో రంగంలోకి దిగబోతున్నాడని చెబుతున్నారు. ఇలాంటి షరతులు శంకర్ కి కొత్తేమీ కాదు. ఎన్ని షరతులు పెట్టినా.. ఆయన అనుకున్న సమయానికే సినిమాని పూర్తి చేస్తాడు.కాబట్టి శంకర్ విషయంలో దిల్ రాజు షరతులు వర్తించవనే చెప్పాలి...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...




ఢిల్లీ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కేది ఎవరు ....?

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>