PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu-jagan29ea3edb-e81f-47a6-9d66-4543df646dd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu-jagan29ea3edb-e81f-47a6-9d66-4543df646dd1-415x250-IndiaHerald.jpgఒకరు ఏపీ ముఖ్యమంత్రి. మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఇద్దరూ ఇద్దరే. ఒకరిని మించిన వారు మరొకరు అన్నట్లుగా ఏపీలో రాజకీయం చేసేవారే. ఢీ అంటే ఢీ అంటూ ఏపీ పాలిటిక్స్ లో దూకుడు చేసేవారే. అటువంటి ఈ ఇద్దరూ ఒకే చోటకు ఒకరి వెంట ఒకరు వస్తున్నారు అంటే అక్కడ అగ్గి రాజుకోకుండా ఉంటుందా. babu jagan;tara;jagan;andhra pradesh;vishakapatnam;chief minister;king;tdp;central government;partyబాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?babu jagan;tara;jagan;andhra pradesh;vishakapatnam;chief minister;king;tdp;central government;partyTue, 16 Feb 2021 16:14:26 GMTఏపీ ముఖ్యమంత్రి. మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఇద్దరూ ఇద్దరే. ఒకరిని మించిన వారు మరొకరు అన్నట్లుగా ఏపీలో  రాజకీయం చేసేవారే. ఢీ అంటే ఢీ అంటూ ఏపీ పాలిటిక్స్ లో దూకుడు చేసేవారే. అటువంటి ఈ ఇద్దరూ ఒకే చోటకు ఒకరి వెంట ఒకరు వస్తున్నారు అంటే అక్కడ అగ్గి రాజుకోకుండా ఉంటుందా.

ఇంతకీ దీని కధా కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇపుడు విశాఖలో పెద్ద మంట పెడుతోంది. ఉక్కు నగరంగా సార్ధక నామధేయంతో వర్ధిల్లుతున్న విశాఖకు ఆ పేరు తీసేస్తే ఎలా ఉంటుంది. ఇదే ఇపుడు ఉక్కు విషయంలో విశాఖ వాసుల  వేదన  మరి. విశాఖ ఉక్కుని జాతీయ సంపదగా ఉంచాలని జనాలు కోరుతున్నారు. విశాఖ విషయంలో రెండవ మాట లేకుండా కేంద్రం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఇక విశాఖలో టీడీపీ ఉక్కు ఉద్యమాన్ని తన మటుకు తాను నిర్వహిస్తోంది. ఆ పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు అమరణ దీక్ష చేపట్టారు. ఆయన దీక్షను భగ్నం చేశారు. దాంతో పరామర్శకు చంద్రబాబు వచ్చారు.

ఆయన వచ్చీ రావడంతోనే జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కావడానికి జగనే కారణమని ఘాటు కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ భూములను కబ్జా చేయడానికే ఇలా  చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కూడా విమర్శించారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అసలు పాపాల భైరవుడు జగనే నని బల్ల గుద్ది మరీ చంద్రబాబు చెప్పేసాక అగ్గి రాజుకుంటుందిగా. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 17న విశాఖ వస్తున్నారు. ఆయన విశాఖ శ్రీ శారదాపీఠం లో జరిగే వార్షిక ఉత్సవాలలో పాలుపంచుకునేందుకు వస్తున్నారు. మరి విశాఖ ఉక్కు సెగ జగన్ కి ఎలా తగులుతుంది అన్నది ఒక వైపు చర్చగా ఉంటే జగన్ విశాఖ ఉక్కు కార్మికులను కలుస్తారు అంటున్నారు. మరి వారితో ఆయన ఏం మాట్లాడుతారు. ఏ విధంగా ఈ ఉక్కు సెగ నుంచి తప్పించుకుంటారు అన్నది కూడా చర్చగా ఉంది.




వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>