Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ravichardran-ashwin620c5aa9-9264-4905-8acc-e307ffbd4812-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/ravichardran-ashwin620c5aa9-9264-4905-8acc-e307ffbd4812-415x250-IndiaHerald.jpgరవిచంద్రన్ అశ్విన్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. అయితే ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టినప్పటికీ ఓ విషయంలో మాత్రం అశ్విన్ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే మాజీ స్పిన్నర్ హర్బజన్‌ సింగ్‌కు క్షమాపణ చెప్పాడు. అయితే ఈ క్షమాపణకు..ravichardran ashwin;naga;rani;dargah sharif;naga aswin;bcci;twitter;chepauk;paruguహర్బజన్‌కు అశ్విన్ సారీ.. భజ్జీ రిప్లై ఏంటంటే..హర్బజన్‌కు అశ్విన్ సారీ.. భజ్జీ రిప్లై ఏంటంటే..ravichardran ashwin;naga;rani;dargah sharif;naga aswin;bcci;twitter;chepauk;paruguTue, 16 Feb 2021 12:29:00 GMTఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్ అశ్విన్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. అయితే ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టినప్పటికీ ఓ విషయంలో మాత్రం అశ్విన్ బాధపడ్డాడు. ఈ క్రమంలోనే మాజీ స్పిన్నర్ హర్బజన్‌ సింగ్‌కు క్షమాపణ చెప్పాడు. అయితే ఈ క్షమాపణకు భజ్జీ కూడా రిప్లై ఇచ్చాడు. అశ్విన్‌ క్షమాపణ చెప్పాల్సిన పనిలేదని, అతడో గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు.

చెన్నైలోని చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోని అదరగొడుతూ.. జట్టును విజయానికి చేరువ చేస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. మూడో రోజు ఆట ముగిసిన తరువాత మాజీ స్పిన్నర్ హర్బజన్‌కు క్షమాపణ చెప్పాడు. అదీ ఎందుకో తెలుసా? భజ్జీకి సంబంధించిన ఓ రికార్డును అధిగమించినందుకు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు తీసిన అశ్విన్.. స్వదేశంలో అత్యథిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భజ్జీని వెనక్కునెట్టి రెండో స్థానానికి చేరాడు. దీనికి సంబంధించే అశ్విన్ భజ్జీకి క్షమాపణ చెప్పాడు.

మ్యాచ్ అనంతరం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అశ్విన్ మాట్లాడాడు. అందులో తన రికార్డు గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. ఇదే వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన అశ్విన్.. ‘సారీ భజ్జు పా’ అంటూ హర్భజన్‌కు క్షమాపణ చెప్పాడు. దీనిపై హర్బజన్ కూడా ఎంతో హుందాగా స్పందించాడు. ‘నువ్వో ఛాంపియన్‌వి. నువ్వు ఇంతకన్నా గొప్ప రికార్డులు మరిన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంటోంది. హర్భజన్‌ గొప్పతనాన్ని అనేకమంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో రాణించిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి అదరగొట్టాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ అదరగొడుతున్నాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ 116 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. టీమిండియా ప్రస్తుతం విజయానికి కేవలం 3 వికెట్ల దూరంలో ఉంది.

" style="height: 435px;">





‘బాబోయ్ ఈ స్పిన్ ఆడడం మా వల్ల కాదు..’

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>