MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1d883412-16d8-4fd1-9c5e-eb6fb48eec30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa1d883412-16d8-4fd1-9c5e-eb6fb48eec30-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో చాల మంది దర్శకులు ఉన్నారు. కానీ కొంతమందికే సరైన గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారిలో ఒక్కరు సుకుమార్. ప్రస్తుతం ఈయన శిష్యుడు తెరకెక్కించిన ఉప్పెన సినిమా సాధించిన విజయంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. దాంతో పాటు తన సినిమా పుష్పపై కూడా ఫోకస్ చేసాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. pushpa;kumaar;allu arjun;geetha;prasad;rashmika mandanna;sukumar;cinema;sangeetha;ala venkatapuram lo;industry;heroine;mythri movie makers;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloపుష్ప’ కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్న సుకుమార్..!?పుష్ప’ కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్న సుకుమార్..!?pushpa;kumaar;allu arjun;geetha;prasad;rashmika mandanna;sukumar;cinema;sangeetha;ala venkatapuram lo;industry;heroine;mythri movie makers;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloTue, 16 Feb 2021 10:00:00 GMTసినిమా సాధించిన విజయంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. దాంతో పాటు తన సినిమా పుష్పపై కూడా ఫోకస్ చేసాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బన్నీ నుంచి అల వైకుంఠపురములో.. సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి కూడా అలాగే ఉంది. బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది.

ఇప్పటికే పుష్ప షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది. ఎర్రచందనం నేపథ్యంలో వస్తున్న కథ కావడంతో ఎక్కువ భాగం అడవుల్లోనే ప్లాన్ చేసాడు సుకుమార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో షూటింగ్ అంటే అంత ఈజీ కాదు. మొన్నటి వరకు ఏపీలోని మామిడిపల్లి సమీపంలో పుష్ప షూటింగ్ చేసాడు సుకుమార్. అయితే కరోనా కారణంగా యూనిట్‌లో ఓ సభ్యుడు చనిపోవడంతో షూటింగ్‌కు ప్యాకప్ చెప్పారు.

ఇక పైగా ప్రతీసారి అడవుల్లో షూటింగ్ అంటే అందరి డేట్స్ ఒకేసారి తీసుకోవడం కష్టంగానే మారుతుంది. అందుకే సుకుమార్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో నిర్మాతలు ముందు షాక్ తిన్నా ఆ తర్వాత ఓకే అన్నారని తెలుస్తుంది. పైగా రిలీజ్ డేట్ కూడా తన్నుకుంటూ వచ్చేస్తుంది.

అయితే ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నామని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటి పరిస్థితుల్లో లేనిపోని రిస్కులు తీసుకోవడం యిష్టం లేని సుకుమార్.. అడవుల సెట్ హైదరాబాద్‌లోనే వేయిస్తున్నాడు. ఇక్కడే మిగిలిన మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు లెక్కల మాస్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు.




100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>