PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఅయితే టెక్క‌లిలో అచ్చెన్ను ఢీ కొట్టాలంటే దువ్వాడ క‌రెక్ట్ అని భావించిన జ‌గ‌న్ దువ్వాడ‌కు టెక్కలి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు, టెక్క‌లి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడును టార్గెట్ చేసే క్ర‌మంలో దువ్వాడ దూకుడుతో రెచ్చిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవ‌ల నిమ్మాడ‌లో అయితే ఆయ‌న చేసిన హ‌ల్ చ‌ల్‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అంటేనే ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల వేళ ఎంపీ విజయసాయిని నిమ్మాడలో పర్యటించాలని దువ్వాడ శ్రీనివాస్‌ ysrcp jagan mohan reddy;atchannaidu kinjarapu;andhra pradesh;mp;district;minister;cheque;letter;tdp;local language;ycp;tekkali;dookudu;kavuru srinivas;partyవైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?ysrcp jagan mohan reddy;atchannaidu kinjarapu;andhra pradesh;mp;district;minister;cheque;letter;tdp;local language;ycp;tekkali;dookudu;kavuru srinivas;partyTue, 16 Feb 2021 15:25:00 GMTవైసీపీలో ఆ నేత ఓవ‌ర్ యాక్ష‌న్ తో పార్టీ నేత‌లు ఆయ‌న‌కు ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్ అని బిరుదు ఇచ్చేశారా ?  పార్టీ నేత‌లు సైతం ఆయ‌న దూకుడుతో త‌ల ప‌ట్టుకుంటున్నారా ? ఆయ‌న తీరుతో పార్టీ అంతిమంగా న‌ష్ట పోతోందా ? అంటు అవున‌నే ఆన్స‌ర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ నేత దూకుడుకు ఎలా చెక్ పెట్టాలా ? అని పార్టీ పెద్ద‌లు ఆలోచ‌న చేస్తున్నారు. ఆ నేత ఎవ‌రో కాదు శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌. గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో టెక్క‌లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ టెక్క‌లి సీటు పేరాడ తిల‌క్‌కు ఇచ్చి.. దువ్వాడ‌ను ఎంపీగా పోటీ చేయించారు. ఇద్ద‌రూ ఓడిపోయారు. అయితే టెక్క‌లిలో అచ్చెన్ను ఢీ కొట్టాలంటే దువ్వాడ క‌రెక్ట్ అని భావించిన జ‌గ‌న్ దువ్వాడ‌కు టెక్కలి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు, టెక్క‌లి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడును టార్గెట్ చేసే క్ర‌మంలో దువ్వాడ దూకుడుతో రెచ్చిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవ‌ల నిమ్మాడ‌లో అయితే ఆయ‌న చేసిన హ‌ల్ చ‌ల్‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అంటేనే ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు.

ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల వేళ ఎంపీ విజయసాయిని నిమ్మాడలో పర్యటించాలని దువ్వాడ శ్రీనివాస్‌ ఆహ్వానించగా.. దానికి జిల్లా నేతలే అడ్డుపుల్ల వేశారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. జిల్లాలో ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని, కృపారాణి వంటి సీనియర్ల‌తో పాటు మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు, పేరాడ తిల‌క్ లాంటి వాళ్లు ఎంతో మంది దువ్వాడ దూకుడు ఎఫెక్ట్ జిల్లా అంతా ప‌డేలా ఉంద‌ని ఆవేద‌న చెందుతోన్న ప‌రిస్థితి.

అదేమ‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే త‌న‌కు జ‌గ‌న్ స‌పోర్ట్ ఉంద‌ని.. త‌న‌ను ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరని ఆయ‌న విర్ర వీగుతోన్న ప‌రిస్థితి ఉంద‌ట‌. ఏదేమైనా ఈ ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్ దూకుడుకు బ్రేకులు వేయ‌క‌పోతే పార్టీ న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని సొంత పార్టీ నేత‌ల టాక్ ? 


బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>