PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-the-homeless3ccafce6-d062-43b5-a66a-72ec7de71cb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-for-the-homeless3ccafce6-d062-43b5-a66a-72ec7de71cb6-415x250-IndiaHerald.jpgస్మార్ట్ టౌన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌కు రూపం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు మార్కెట్‌ కంటే తక్కువ ధరకు ఇళ్లు కల్పించటమే ఈ స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ల ఉద్దేశం. పట్టణ గృహ సముదాయాల ఏర్పాటుపై ఇప్పటికే సమీక్షించారు సీఎం జగన్. పేదలందరికి ఇళ్లు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతికి కూడా ఇళ్లు కల్పించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోgood news for the homeless;editor mohan;jagan;andhra pradesh;chief minister;population;good news;sv mohan reddy;reddy;good newwzఇల్లు లేని వారికి గుడ్ న్యూస్..!ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్..!good news for the homeless;editor mohan;jagan;andhra pradesh;chief minister;population;good news;sv mohan reddy;reddy;good newwzTue, 16 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు మార్కెట్‌ కంటే తక్కువ ధరకు ఇళ్లు కల్పించటమే ఈ స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ల ఉద్దేశం. పట్టణ గృహ సముదాయాల ఏర్పాటుపై ఇప్పటికే సమీక్షించారు సీఎం జగన్.

పేదలందరికి ఇళ్లు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతికి కూడా ఇళ్లు కల్పించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై  సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో ఉండాల్సిన మౌళిక సదుపాయాలపై ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. మధ్యతరగతి వర్గాలకు మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకు, క్లియర్‌ టైటిల్‌తో ఉండే ఇళ్లు కల్పించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. .

అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేవిధంగా ప్రణాళిక ఉండాలంటే ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు సూచించారు సీఎం. ముఖ్యంగా పట్టణాలు, నగరాల చుట్టూ రింగురోడ్ల నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు ఇచ్చారు. ఇవి భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి  ప్రయోజనం కలిగేలా నిర్మాణాలు ఉండనున్నాయి.

ఈ రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్‌ లే అవుట్లు ఏర్పాటు చేస్తారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్‌ చేపట్టాలని ప్రాథమిక నిర్ణయించారు. నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన 25  నుంచి 200 ఎకరాల్లో   స్మార్ట్‌ టౌన్స్‌ రూపకల్పన చేస్తారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్‌ సిద్ధంచేసేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు.

మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతింటి కలలు కనేవారికి గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇప్పటికే ఇంటి స్థలాలతో పేదల్లో ఆశలు రేపిన ముఖ్యమంత్రి ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలనే గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా స్మార్ట్ టౌన్ షిప్ కాన్సెప్ట్ కు ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇంటి కోసం కలలకు కనేవారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.


పాపం ఏపీ బిజెపి... నెత్తిన పెద్ద బండ పడిందిగా

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>