PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf7c2f886-e991-4ecf-bf88-fb087c2a18d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf7c2f886-e991-4ecf-bf88-fb087c2a18d2-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేషన్ అందించే వాహనాలను పరిశీలించి...ఆ వాహనాలపై అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉన్నాయంటూ ఇది ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉన్న కారణంగా వీటిని మార్చాలంటూ ఆదేశించారు. jagan-nimmagadda-elections;kumaar;jagan;andhra pradesh;panchayati;court;ycp;march;party;santoshamజగడ్డ: ఆ విషయంలో ప్రభుత్వానిదే పైచేయి...?జగడ్డ: ఆ విషయంలో ప్రభుత్వానిదే పైచేయి...?jagan-nimmagadda-elections;kumaar;jagan;andhra pradesh;panchayati;court;ycp;march;party;santoshamTue, 16 Feb 2021 11:00:00 GMTజగన్ సర్కార్ పుణ్యమా అని ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేషన్ అందించే వాహనాలను పరిశీలించి...ఆ  వాహనాలపై అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉన్నాయంటూ ఇది ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉన్న కారణంగా వీటిని మార్చాలంటూ ఆదేశించారు. అయితే ఎస్ ఈ సి ఆదేశాలను సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కాగా రేషన్ వాహనాల పై ఉన్న గుర్తులను, ఫోటోలను, రంగులను మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ఎస్ ఈ సి ఆదేశం మేరకు అందుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రేషన్ డోర్ డెలవరీ పథకం పై ఆధారపడి ఎంతో మంది పేదలు ఉన్నారని... దాదాపుగా నాలుగున్నర కోట్ల లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారని వాళ్లందరికీ సకాలంలో సరుకులు అందించే బాధ్యత రాష్ట్రంపై ఉందని పేర్కొన్నారు. ఇక వాహన రంగులు గుర్తులు మార్చే విషయానికొస్తే అందుకు ఎంత లేదన్నా కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అంతేకాక అందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించింది.

పేదలకు ఈ సరుకులు ఎంత ముఖ్యమో అర్థం చేసుకుని రేషన్ పంపిణీ అడ్డంకులు కలిగించకుండా ఎస్ఈసీని అడ్డుకోవాలని కోర్టును కోరింది వైసిపి. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనల విన్న తరువాత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపైన స్టే  ఇస్తూ....రేషన్‌ డోర్‌ డెలివరీకి తిరిగి అనుమతిని ఇచ్చింది. హైకోర్టు అందించిన శుభవార్తతో తిరిగి రేషన్ డోర్ డెలివరీ కి సంసిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. దీనిని బట్టి ఎన్నికల సంఘం ఇకనైనా ఇలాంటి స్వార్థపూరిత చర్యలను ఆపాలని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మేము తీసుకున్నది సరైన నిర్ణయం కాబట్టే కోర్ట్ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అని సంతోషంగా ఉన్నారు...ఇందులో సగటు మానవుడు అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో ఎస్ ఈ సి పైన ప్రభుత్వానిదే పై చేయి అంటున్నారు


పద్యం చెబితే.. పెట్రోల్ ఫ్రీ..

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>