MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-prabhas3bdae318-3243-421a-ad20-72816128cf3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-prabhas3bdae318-3243-421a-ad20-72816128cf3b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఆ నాటి నుంచి నేటితరం ప్రేక్షకుల వరకు సుపరిచితం ఈ దర్శకుడు. శాతాదిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందారుhero prabhas;prabhas;venkatesh;k raghavendra rao;krishnam raju;india;tollywood;cinema;hero;silver;father;raghavendra;jayamప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?hero prabhas;prabhas;venkatesh;k raghavendra rao;krishnam raju;india;tollywood;cinema;hero;silver;father;raghavendra;jayamTue, 16 Feb 2021 14:00:00 GMTరాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఆ నాటి నుంచి నేటితరం ప్రేక్షకుల వరకు సుపరిచితం ఈ దర్శకుడు. శాతాదిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందారు ఆయన. హీరోహీరోయిన్లను బట్టి సినిమా కథను మలిచేసి హిట్ సొంతం చేసుకోవడం ఆయనొక్కడికే చెల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు .

ఇక హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా అప్పట్లో రాఘవేంద్రరావే టాప్‌. అందుకే వెంకటేష్, మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి వాళ్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేసి.. స్టార్లు అయ్యేలా చేశాడు ఈ దర్శకేంద్రుడు.

అయితే రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయలేక పోయాడు . అయితే ప్రభాస్‌ తండ్రి రాఘవేంద్రరావుకు సన్నిహితుడు కావడంతో తన కొడుకుతో సినిమా చేయమని రాఘవేంద్ర రావుని అడిగారట. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ డైరెక్షన్లో తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు .

ఇక ఇదే విషయాన్నితాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. అప్పటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు రాఘవేంద్ర రావు . ‘ప్రభాస్‌ని నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా.. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు’ అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు . ఇక దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్‌ సి. పరాన్జీకి దక్కింది . ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు .


రేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసింది

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>