PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/panchayat-elections-result-conditions58026d81-9eee-49b8-aa97-a2cdceb0e22f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/panchayat-elections-result-conditions58026d81-9eee-49b8-aa97-a2cdceb0e22f-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రీకౌంటింగ్ అంటూ హడావిడి మొదలైంది. స్వల్ప మెజార్టీ వచ్చిన సందర్భంలో పరాజితులు రీకౌంటింగ్ కి పట్టుబట్టడం సహజమే. అయితే అదే సమయంలో అధికారులు సంయమనంతో వ్యవహరించాలని, మరింత పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలని సూచించారు ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్. నెల్లూరు జిల్లాలో అధికారులకు పరోక్షంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రెండు విడదల్లో జరిగిన ఎన్నికల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఆయన తాజా సూచనలు చేశారు. మూడు, నాలుగు విడతల్లjagan-nimmagadda-elections;kumaar;panchayati;election commission;pettaజగడ్డ: రాత్రి 10గంటలలోపే పంచాయతీ ఫలితాలు తేలిపోవాలి..జగడ్డ: రాత్రి 10గంటలలోపే పంచాయతీ ఫలితాలు తేలిపోవాలి..jagan-nimmagadda-elections;kumaar;panchayati;election commission;pettaTue, 16 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రీకౌంటింగ్ అంటూ హడావిడి మొదలైంది. స్వల్ప మెజార్టీ వచ్చిన సందర్భంలో పరాజితులు రీకౌంటింగ్ కి పట్టుబట్టడం సహజమే. అయితే అదే సమయంలో అధికారులు సంయమనంతో వ్యవహరించాలని, మరింత పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలని సూచించారు ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్. నెల్లూరు జిల్లాలో అధికారులకు పరోక్షంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రెండు విడదల్లో జరిగిన ఎన్నికల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఆయన తాజా సూచనలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలో 17వ తేదీన, నెల్లూరు డివిజన్‌లో 21న పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు నోడల్‌ అధికారులు, సిబ్బంది సన్నద్ధం కావాలని ఎన్నికల పరిశీలకులు బసంత్ ‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారని అధికారులను ఆయన అభినందిచారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిని ఎంచుకోవాలని సూచించారు. పోలింగ్‌ జరిగిన రోజే రాత్రి 10 గంటల్లోగా ఫలితాలు ప్రకటించాలని ఆదేశించారు. ఒక్కసారి మాత్రమే రీకౌంటింగ్‌ నిర్వహించాలని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేకంగా వెబ్ ‌కాస్టింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫలితం ప్రకటించకుండా ఆలస్యం చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గంటకు పోలింగ్‌ శాతం ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన రెండు విడతల ఎన్నికల్లో.. ఫలితాల ప్రకటన జాప్యం అయిందని, రీకౌంటింగ్ కి అధికారులు సహకరించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్నికల పరిశీలకులు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తుది ఫలితం ప్రకటించే సమయం రాత్రి 10గంటలు దాటొద్దని చెప్పారు. 


పద్యం చెబితే.. పెట్రోల్ ఫ్రీ..

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>