PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/india-afghanistan-achieved-upper-hand-on-china-in-un6f4e733e-f270-4c97-8412-32cd29c24287-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/india-afghanistan-achieved-upper-hand-on-china-in-un6f4e733e-f270-4c97-8412-32cd29c24287-415x250-IndiaHerald.jpgఐఖ్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత్ కు సభ్యత్వం లభించకుండా గత చాలా సంవత్సరాలుగా చైనా అడ్దుపడుతుంది. సెక్యూరిటీ కౌన్సిల్ లోని ఐదు ప్రధాన సభ్య దేశాలలో నాలుగు సభ్యదేశాలు మనకు సంపూర్ణ మద్ధతు నిస్తున్నాయి. అంతే కాదు ప్రపంచ దేశాలలో చాలా దేశాలు భారత్ కు సభ్యత్వం రావటాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే పానకంలో పుడకలాగా చైనా ఎప్పుడూ ఈ విషయం లో మనకు అడ్డు తగుల్తుంది. అవసరమైతే వీటో ప్రయోగించేంత వరకు వెళుతుంది. ఈ వీటో అధికారమున్న దేశాల్లో చైనా ఒకటి. un commission on status of women;mahi;poorna;india;afghanistan;paanakam;korcha;letter;internationalయునైటెడ్ నేషన్స్ లో చైనా పై పైచేయి సాధించిన భారత్యునైటెడ్ నేషన్స్ లో చైనా పై పైచేయి సాధించిన భారత్un commission on status of women;mahi;poorna;india;afghanistan;paanakam;korcha;letter;internationalMon, 15 Feb 2021 21:00:00 GMT




ఐఖ్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత్ కు సభ్యత్వం లభించకుండా గత చాలా సంవత్సరాలుగా చైనా అడ్దుపడుతుంది. సెక్యూరిటీ కౌన్సిల్ లోని ఐదు ప్రధాన సభ్య దేశాలలో నాలుగు సభ్యదేశాలు మనకు సంపూర్ణ మద్ధతు నిస్తున్నాయి. అంతే కాదు ప్రపంచ దేశాలలో చాలా దేశాలు భారత్ కు సభ్యత్వం రావటాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే పానకంలో పుడకలాగా చైనా ఎప్పుడూ ఈ విషయం లో మనకు అడ్డు తగుల్తుంది. అవసరమైతే వీటో ప్రయోగించేంత వరకు వెళుతుంది. ఈ వీటో అధికారమున్న దేశాల్లో చైనా ఒకటి.



అయితే భారత్ చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  రెండు దేశాల సరిహద్ధుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఒకవైపు చర్చలు జరుపుతూనే చైనా సైన్యాన్ని సరిహద్ధులకు తరలిస్తుండటంతో భారత్ అప్రమత్తం అయ్యింది. 



భారీ ఎత్తున బోర్డర్ లో సైన్యాన్ని మోహరిస్తోంది.  చైనా ఆర్ధిక మూలలను దెబ్బకొట్టేందుకు ఇండియా ఆ దేశానికీ చెందిన చాలా యాప్స్ ను ఇప్పటికే బ్యాన్ చేసింది. ఇక ఇదిలా ఉంటె అంతర్జాతీయ వేదికపై కూడా చైనాకు  ఇండియా  మొగుడై కూర్చుంది.



ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్' లో అంతర్భాగంగా ఉన్న ‘కమిషన్ ఆన్ స్టేటస్ అఫ్ విమెన్’ లో భారత్ సభ్యత్వాన్ని సంపాదించింది. ఇందులో సభ్యత్వం పొందేందుకు భారత్ తో పాటు ఆఫ్గనిస్తాన్, చైనా దేశాలు పోటీ పడగా, భారత్, ఆఫ్గనిస్తాన్ లు సభ్యత్వం దక్కించుకున్నాయి.



కమిషన్ ఆన్ స్టేటస్ విమెన్ లో సభ్యత్వం పొందాలంటే కనీసం 28 దేశాల మద్దతు అవసరం కాగా, ఆఫ్గనిస్తాన్ కు 39, ఇండియాకు 38 దేశాలు మద్దతు చేయగా, చైనాకు కేవలం 27 దేశాలు మాత్రమే మద్దతు చేయడం విశేషం. మహి  సాధికారతకు ఈ సంస్థ కృషి చేస్తుంది. 



మహిళల స్థితిపై కమిషన్, ఐక్యరాజ్య సమితిలోని, ప్రధాన యునైటెడ్ నేషన్స్ విభాగాలలో ఒకటైన ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి యొక్క క్రియాత్మక కమిషన్. "కమీషన్ ఆన్ స్టాటస్ ఆఫ్ ఉమెన్" లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే విభాగం మరియు మహిళల సాధికారతగా అభివర్ణించబడింది.


సభ్యదేశాలకు ఈ సంస్థ నిధులను సమకూరుస్తుంది.  2021 నుంచి 2025 వరకు భారత్ ఈ సంస్థలో సభ్యదేశంగా కొనసాగుతుంది.






మరోసారి బయటపడ్డ బాలయ్య నిజ స్వరూపం..అభిమానితో బాలయ్య ఫోన్ కాల్ లీక్..??

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!

డప్పు కొడుతున్న అనసూయ.. కుర్రాళ్ల గుండెల్లో నిప్పు రాజేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>